Visakhapatnam: మధురవాడ కొమ్మాదిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

Visakhapatnam: విశాఖపట్నం మధురవాడ కొమ్మాది సాయిరాం కాలనీలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. జై గణేష్ టైగర్ బాయ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.

JAI RAM, MADURAWADA
Published on: 14 Sept 2026 4:37 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: మధురవాడ కొమ్మాదిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా, మధురవాడ పరిధిలోని కొమ్మాది జంక్షన్‌ సాయిరాం కాలనీలో జై గణేష్ టైగర్ బాయ్స్ ఆధ్వర్యంలో సోమవారం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

కాలనీ పరిసరాలు గణపతి నామస్మరణతో మార్మోగగా, యువత ఉత్సాహంగా ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా జై గణేష్ టైగర్ బాయ్స్ సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ, కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులు, కాలనీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA