Bheemili: భీమిలి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Bheemili: భీమిలి మండలం తిమ్మాపురం వద్ద అదుపుతప్పి కారును ఢీకొట్టి, మహిళపైకి దూసుకెళ్లిన బైక్. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.

SHIVA, BHIMILI
Published on: 5 Aug 2026 7:17 PM IST
Bheemili
X

Bheemili: భీమిలి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

​భీమిలి: తిమ్మాపురం వద్ద బుధవారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. అతివేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి కారును ఢీకొట్టి, ఆపై రోడ్డు దాటుతున్న మహిళపైకి దూసుకెళ్లింది.

ఈఘటనలో విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన గ్రంధి సూరి అక్కడికక్కడే శవమయ్యాడు. తీవ్రంగా గాయపడిన తిమ్మాపురానికి చెందిన కృష్ణవేణి (43) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story