Visakhapatnam: ప్రజాచైతన్యం కోసం కళాకారులు సిద్ధం కావాలి
Visakhapatnam: ధరల పెరుగుదలపై ప్రజలను చైతన్యపరచడానికి కవులు, కళాకారులు తమ గళాలను విప్పాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి. చంద్రనాయక్ పిలుపునిచ్చారు.
Visakhapatnam: ప్రజాచైతన్యం కోసం కళాకారులు సిద్ధం కావాలి
Visakhapatnam: అనేక సమస్యలు ఎదుర్కొంకొంటున్న దేశం కోసం ప్రజలను చైతన్య పరచడానికి కళాకారులు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి చంద్రనాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం విశాఖ నగరంలో గల నీలం రాజశేఖర్ రెడ్డి భావనలో ఉత్తరాంధ్ర ప్రాంతీయ ప్రజానాట్య మండలి సమావేశం అప్పన్న రాముల అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చంద్రనాయక్ మాట్లాడుతూ పాలకుల విధానాల మూలంగా దేశం అనేక రకాల సమస్యల వలయంలో చిక్కుకున్న నేపథ్యంలో ప్రజలను జాగృతం చేయడానికి కవులు కళాకారులు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జూలై రెండవ వారంలో రచయితలు కళాకారులతో వర్క్ షాపులు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నామని తెలిపారు.
పెరిగిపోతున్న పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు ఇతర నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రించాలంటూ అలాగే విద్యా వ్యాపారీకరణ నిరుద్యోగం విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో కవులు కళాకారులు తమ కలాలు, గళాలను పదునుపెట్టాలని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రెహమాన్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజానికి కళాకారుల అవసరం చాలా ఉన్నారు. ప్రజల సమస్యలు పెరిగిపోయిన నేపథ్యంలో కళాకారులు సమాజం కోసం పనిచేయాలన్నారు.
ప్రజానాట్యమండలి కోశాధికారి పిచ్చయ్య మాట్లాడుతూ గొప్ప చరిత్ర గలిగిన ప్రజానాట్యమండలి సమాజానికి ఎనలేని సేవ చేసిందన్నారు. ప్రజానాట్యమండలి జెండాను సీనియర్ కళాకారులు కృష్ణ ఆవిష్కరించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు మహంతి లక్ష్మణరావు, నెలివాడ అప్పారావు, సత్యాంజనేయ కాసుల్ రెడ్డి బి శివ,కృష్ణ, రమణ చిరంజీవి దేవుడమ్మ నూకాలు లక్ష్మణరావు పోలా రావు తదితరులు పాల్గొన్నారు.




