Visakhapatnam: జూలై నెలలో రూ. 1.10 కోట్ల విలువైన ఆస్తులు రికవరీ

Visakhapatnam: విశాఖపట్నంలో జూలై నెలలో 106 ఆస్తి నేరాలను ఛేదించి, రూ.1.10 కోట్ల విలువైన బంగారం, వెండి, వాహనాలు మరియు మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

SHIVA, BHIMILI
Published on: 29 Aug 2026 9:12 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: జూలై నెలలో రూ. 1.10 కోట్ల విలువైన ఆస్తులు రికవరీ

విశాఖపట్నం: జూలై నెలలో విశాఖ నగరంలో 106 ఆస్తి నేరాల కేసులు నమోదయ్యాయి. వీటిలో 91 కేసులను ఛేదించి 104 మంది నిందితులను అరెస్ట్ చేశాం. వారి నుంచి మొత్తం రూ.1.10 కోట్లకుపైగా విలువైన ఆస్తులను రికవరీ చేశాం. ఇందులో 491.62 గ్రాముల బంగారం, 1,645.6 గ్రాముల వెండి, రూ.2.14 లక్షల నగదుతో పాటు 40 ద్విచక్ర వాహనాలు, 5 కార్లు, ఒక పోస్టల్ వ్యాన్ ఉన్నాయి.

అలాగే 441 మొబైల్ ఫోన్లను రికవరీ చేశాం. వీటిలో 423 పోయిన మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.63.45 లక్షలు. మొబైల్ ఫోన్ల రికవరీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇప్పటివరకు విశాఖ నగర పోలీసులు 11,553 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.17.33 కోట్లు..

ఇది మా 25వ ఆస్తుల రికవరీ మేళా. ఇప్పటివరకు 10,279 మంది బాధితులకు ఆస్తులను తిరిగి అందించాం.. ఈ మేళాలో మరో 514 మంది బాధితులకు రూ.1.10 కోట్ల విలువైన ఆస్తులను అందిస్తున్నాం. దీంతో ఇప్పటివరకు లబ్ధిదారుల సంఖ్య 10,793కు చేరింది..

రికవరీ చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.25.24 కోట్లు..

నేరాలను ఛేదించడంతో పాటు ముందస్తు చర్యలపైనా దృష్టి పెట్టాం. జూలైలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో 363 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్రజలకు నేరాలపై అవగాహన కల్పించేందుకు 237 కార్యక్రమాలు నిర్వహించాం.

నేరం జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడం ఎంత ముఖ్యమో.. బాధితులు కోల్పోయిన ఆస్తులను తిరిగి వారికి అందించడం కూడా అంతే ముఖ్యమని భావిస్తున్నాం.

అందుకే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ కేసులను ఛేదించడంతో పాటు.. బాధితులకు వారి ఆస్తులను తిరిగి అందించే ప్రక్రియను కొనసాగిస్తున్నాం.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story