Visakhapatnam: విశాఖ MVV City లో తీవ్ర నీటి ఎద్దడి రోడ్డెక్కిన ప్రజలు!

Visakhapatnam: విశాఖ MVV City లో నీటి ఎద్దడి. నాలుగు రోజులుగా తాగునీరు లేక ఎండాడ వాటర్ ట్యాంక్ కార్యాలయాన్ని ముట్టడించిన నివాసితులు. స్పందించాలని GVMC కి విజ్ఞప్తి.

JAI RAM, MADURAWADA
Published on: 13 Sept 2026 12:38 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ MVV City లో తీవ్ర నీటి ఎద్దడి రోడ్డెక్కిన ప్రజలు!

Visakhapatnam: విశాఖపట్నం ఎండాడ–పీఎం పాలెం పరిధిలోని MVV Cityలో గత నాలుగు రోజులుగా తీవ్ర నీటి సంక్షోభం. సుమారు 1,400 ఫ్లాట్లు దాదాపు 6,000 మంది నివాసులు. తాగడానికి నీళ్లు లేవు, వంట చేసుకోవడానికి నీళ్లు లేవు, బాత్రూమ్ అవసరాలకు కూడా నీళ్లు లేని పరిస్థితి.

కనీసం అవసరానికి సరిపడా ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని అందించలేకపోవడంతో, విసిగిపోయిన వందలాది మంది MVV City వాసులు ఈరోజు రాత్రి ఎండాడ వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న కార్యాలయాన్ని ముట్టడించి ధర్నాకు దిగారు. ఇది Luxury సమస్య కాదు, ఇది 6,000 మంది కనీస జీవన అవసరానికి సంబంధించిన సమస్య.

విశాఖలాంటి మహానగరంలో నీళ్ల కోసం వేలాది మంది రాత్రిపూట కార్యాలయాన్ని ముట్టడించాల్సి రావడం — వ్యవస్థకు హెచ్చరిక!

GVMC తక్షణమే స్పందించాలి.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA