Visakhapatnam: పారిశుధ్య కార్మికులకు కొబ్బరినూనె, సబ్బుల పంపిణీ

Visakhapatnam: విశాఖపట్నం సౌత్ జోనల్ కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పారిశుధ్య కార్మికులకు కొబ్బరినూనె, సబ్బులను అందజేసి వారి సేవలను కొనియాడారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 27 Aug 2026 6:10 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: పారిశుధ్య కార్మికులకు కొబ్బరినూనె, సబ్బుల పంపిణీ

విశాఖపట్నం: సౌత్ జోనల్ కార్యాలయంలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పలువురు పారిశుధ్య కార్మికులకు కొబ్బరినూనె, సబ్బులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. నగరంలోని వీధులు, రహదారులను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు నిరంతరం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.

ఎండ, వర్షాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం కూడా బాగుండేలా అవసరమైన సహకారం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

పారిశుధ్య కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం కొబ్బరినూనె, సబ్బులు పంపిణీ చేయడం అభినందనీయమైన చర్య అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సౌత్ జోనల్ కమిషనర్ శ్రీ మల్లయ్య నాయుడు గారితో పాటు జోనల్ కార్యాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story