Madhurawada: మధురవాడ MVV సిటీలో తీవ్ర నీటి ఎద్దడి రోడ్డెక్కిన వాసులు!
Madhurawada: విశాఖ మధురవాడ MVV సిటీలో తీవ్ర నీటి ఎద్దడి. కోట్లు పెట్టి ఫ్లాట్లు కొన్నా నీటి కోసం రోడ్డెక్కామంటూ అపార్ట్‌మెంట్ వాసుల ఆవేదన.
Madhurawada: మధురవాడ MVV సిటీలో తీవ్ర నీటి ఎద్దడి రోడ్డెక్కిన వాసులు!
Madhurawada: విశాఖ మధురవాడ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇక్కడ హైవే కు 100 మీటర్ల దూరంలో ఉంది MVV City 1400 కుటుంబాలు నివసించే భారీ రెసిడెన్షియల్ కమ్యూనిటీ.
ఇంత పెద్ద అపార్ట్‌మెంట్‌లో ప్రస్తుతం నీటి సమస్య నివాసితులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోందని వారు చెబుతున్నారు ఉదయం నిద్ర లేవగానే నీటి కోసం ఎదురుచూపులు నీరు వస్తుందో లేదో తెలియని పరిస్థితి రోజువారీ అవసరాలకు నీటిని సమకూర్చుకోవడం కోసం కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులు ఇదే ప్రస్తుతం తమ పరిస్థితి అంటూ నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
ఈ ఏడాది ఎల్ నినో కారణంగా తక్కువ వర్షపాతం నమోదు కావటం వలన , భూగర్భ జలాలు వినియోగం విపరీతంగా పెరగడం స్థానికంగా అపార్ట్మెంట్ల నిర్మాణాలు ఎక్కువ అవ్వడం తో భూగర్భ జలాలు అడుగంటి నీటి కొరత ఈ ప్రాంతంలో తీవ్రంగా మారింది.
అయితే ఎంవీవీ సిటీ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ కావడం సుమారు 1400 వరకు ఫ్లాట్లు ఉండటం తో నీటి వినియోగం మరింత ఎక్కువ ఉండటంతో జీవీఎంసీ నుండి వచ్చే మంచి నీరు కూడా చాలి చాలక తీవ్రమైన నీటి కొరతతో దిక్కుతోచని స్థితిలో నివాసితులు ఉన్నారు. ప్రవేట్ ట్యాంకర్లు ఎన్నని తెచ్చుకుంటాం ఎంత కాలం అని తెచ్చుకుంటాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సుమారు కోటి రూపాయలు పెట్టు కొనుకున్న తాము కోట్లు ఇచ్చి నీటి కోసం రోడ్లు ఎక్కామని వాపోతున్నారు.
నీళ్లు సరిగా రావడం లేదు రోజువారీ అవసరాలకు చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాల్లో పరిస్థితి మరింత కష్టంగా ఉంది. మరి నివాసితుల ఆవేదనపై అపార్ట్‌మెంట్ యాజమాన్యం, GVMC అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.




