Visakhapatnam: పోలీసు ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొన్న లారీ కానిస్టేబుల్ కాలు విరిగిన వైనం

Visakhapatnam: విశాఖపట్నం జూ పార్క్ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం. పోలీసు ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొన్న లారీ, ఆరుగురు ఏఆర్ కానిస్టేబుళ్లకు గాయాలు.

SHIVA, BHIMILI
Published on: 20 Aug 2026 10:09 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: పోలీసు ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొన్న లారీ కానిస్టేబుల్ కాలు విరిగిన వైనం

Visakhapatnam: విశాఖనగరం నుంచి గుడిలోవ వైపు వెళ్తున్న పోలీసు ఎస్కార్ట్ వాహనాన్ని జూపార్క్ సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ అదుపుతప్పి ఢీకొట్టింది.గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఆరుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు గాయపడగా, వారిలో ఒకరికి కాలు విరిగినట్లు తోటి సిబ్బంది తెలిపారు.​

బాధితులను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదంలో పోలీసు వాహనం తీవ్రంగా దెబ్బతినడంతో ఆరిలోవ పోలీసులు క్రేన్ సహాయంతో దానిని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

బాధితులు గుడిలోవలో విధుల్లో ఉన్న ఇతర సిబ్బందిని రిలీవ్ చేయడానికి వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. ఈప్రమాదంపై ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story