Visakhapatnam: గోపాలపట్నంలో కొత్త పింఛన్ల సేవా కార్యక్రమంలో జనసేన నాయకులు
Visakhapatnam: విశాఖపట్నం గోపాలపట్నంలో జనసేన ఆధ్వర్యంలో నూతన పింఛన్ల లబ్ధిదారులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. అర్హులందరికీ పింఛన్లు అందేలా కృషి చేస్తామన్నారు.
Visakhapatnam: గోపాలపట్నంలో కొత్త పింఛన్ల సేవా కార్యక్రమంలో జనసేన నాయకులు
విశాఖపట్నం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో 91 వ వార్డు గోపాలపట్నం మెయిన్ రోడ్డు స్టేట్ బ్యాంక్ దగ్గర గునిశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో న్యూ పెన్షన్ స్కీం పెన్షనర్లకు సేవలు అందిస్తున్న కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ నాయకులు బెహరా భాస్కర రావు గారు విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో పెన్షన్ కి అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి పెన్షన్ అందే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తుందని, లబ్ధిదారులందరికీ పెన్షన్ అందేటట్లుగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కంపర కోటేశ్వరరావు, ఇల్లపు సురేష్, భారతి, రోజారాణి జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
Next Story




