Visakhapatnam: విశాఖలో గెడ్డ స్థలాల ఆక్రమణ లక్షల్లో విక్రయిస్తూ మాయమాటలు!
Visakhapatnam: విశాఖపట్నంలోని గెడ్డ స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణలు. స్థానిక నాయకులు, అధికారుల అండతో రూ. లక్షల్లో భూక్రయవిక్రయాలు జరుపుతున్నారని తీవ్ర ఆరోపణలు.
Visakhapatnam: విశాఖలో గెడ్డ స్థలాల ఆక్రమణ లక్షల్లో విక్రయిస్తూ మాయమాటలు!
Visakhapatnam: నగర పరిధిలోని గెడ్డలు, వాటి స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయి. స్థానిక నాయకులుగా చెలావ అవుతున్న కొందరు ఆ స్థలాలను చదును చేసి అమ్మకానికి పెట్టేస్తున్నారు. ఎటువంటి అధికారిక ధ్రువపత్రాలు లేకపోయినా తక్కువకు ధరకు వస్తుందని, విద్యుత్తు, కుళాయి కనెక్షన్లు ఇప్పిస్తామని, ఇంటి పన్ను వేయిస్తామని మాయమాటలు చెప్పి అమాయకులకు అంటగడుతున్నారు.తర్వాత శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు అధికారులకు లంచాలు ఇవ్వాలని వసూళ్లకు పాల్పడుతున్నారు.
99వ వార్డు గణేశ నగర్ శివారులో వేపగుంట గణేశ నగర్ శివారులో గెడ్డను ఆనుకొని పెద్దఎత్తున రిటైనింగ్ వాల్స్ను జీవీఎంసీ నిర్మించింది. ఆ సమయంలో ఇంజినీరింగ్ అధికారులు వివిధ ప్రాంతాల్లో 200 నుంచి 300 గజాల స్థలాలను వదిలేశారు. ఇప్పుడు ఆ స్థలాలను ఆక్రమించి జోరుగా నిర్మాణాలు చేస్తున్నారు.
కొందరు అధికారులు స్థానిక నాయకులతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని స్థలాలను వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ గజం స్థలం రూ.50వేల పైమాటే 100 గజాల స్థలం రూ.50లక్షలు ఉంటుందని అంచనా.
ఊటగెడ్డను ఆనుకుని నిర్మాణాలు బీచ్ రోడ్డు సమీపంలోని ఊటగెడ్డకు ఇరువైపులా ఉండాల్సిన ఖాళీ ప్రదేశాలు ఆక్రమణలకు గురయ్యాయి.. గెడ్డ నిర్మాణ సమయంలో చుట్టూ 10-15 అడుగుల ఖాళీ స్థలాలు వదిలారు. ప్రస్తుతం ఎక్కడా ఆ స్థలాలు కనిపించడం లేదు. చాలా ప్రాంతాల్లో గెడ్డను ఆనుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో భారీ వర్షాల సమయంలో ఊటగెడ్డ పోటెత్తి రోడ్లు, పల్లపు ప్రాంతాలను ముంచేస్తోంది.




