Visakhapatnam: ఆరోగ్యంగా జీవించాలి – అందాల సుందరి డాక్టర్ మాలినీ దాసరి

Visakhapatnam: ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆరోగ్యంగా జీవించాలని డాక్టర్ మాలినీ దాసరి పిలుపునిచ్చారు. పెందుర్తి సంకల్ప కళా గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

SHIVA, BHIMILI
Published on: 4 Sept 2026 8:21 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ఆరోగ్యంగా జీవించాలి – అందాల సుందరి డాక్టర్ మాలినీ దాసరి

విశాఖపట్నం: ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆరోగ్యంగా జీవించాలి అని అందాల సుందరి డాక్టర్ మాలినీ దాసరి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పెద్దగాడి కి చేరువలో ఉన్న సంకల్ప కళా గ్రామం లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానంగా ఇటీవల అమెరికా అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అధ్యక్షులు నుంచి అవార్డు సాధించిన ఈమె పుట్టి పెరిగింది, డాక్టర్ అయ్యిందీ విశాఖపట్నం లోనే అని పేర్కొన్నారు. కాగా వైద్యశాలకే పరిమితం కాకూడదు అని "వాక్ బియాండ్ ద వైట్ కోట్‌" అనె పేరుతో విభిన్న వైద్య సేవలు గురించి అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది అని వివరించారు. అందరికీ వైద్య సేవలు అందించాలి అనేది తమ లక్ష్యమని వివరించారు.

ఆమె ఫ్యాకల్టీ అవార్డు ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ మెంటర్ ‌షిప్, హనరరి అవుట్ స్టాండింగ్ మెట్యూర్ గర్ల్ హూ ఇన్స్పైర్స్, హనరీ-షేడ్స్ ఆఫ్ సక్సెస్ 2026, మిసెస్ తెలుగు యుఎస్ ఎం 2025, మిసెస్ ఇండియా వరల్డ్ 2025, మిసెస్ ఇండియా యుఎస్ ఎ 2024, మిసెస్ లూసియానా యూనివర్స్ 2024 గా అందాల సుందరి గుర్తింపు, అవార్డులూ సాధించానని, కానీ ఇది చాలదని ప్రతి ఒక్కరికీ తనవంతు సేవలు అందించాలని కృషి చేస్తున్నానని, ఇంకా ఏదో చేయాలనె తపన తనలో ఉంది అన్నారు. నా పిల్లలకు నేనే రోల్ మోడల్ అవ్వాలనే ఆలోచన తో తనతో వెంట పెట్టుకొని పర్యటిస్తున్నానని వివరించారు.

సంకల్ప కళా గ్రామం గురించి అమెరికా లో పలువురు మిత్రులు చెప్పగా విని వచ్చానన్ళారు. అయితే తాను విన్న దాని కంటే బాగుంది అని వివరించారు. ప్రకృతి ఆధారంగా పండించిన పంటలు, ఆహార పదార్థాలు, ప్రకృతి ఆధారిత రంగులతో తయారు అయిన బట్టలు, కొయ్య బొమ్మలు, కట్టె గానుగ నూనేలు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు తనను బాగా ఆకర్షించాయి అని వివరించారు. మట్టి తో తయారు చేసిన ప్రతిమలు చాలా ఆరోగ్యకరం అయిన ప్రక్రియలని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అందాల సుందరి డాక్టర్ మాలినీ దాసరి తల్లి దాసరి లక్ష్మీ కుమారి, కుమార్తెలు జి సమైక్య, జి సమైన పాల్గొని మాట్లాడారు. సంకల్ప కళా గ్రామం కీలక ప్రతినిధి పార్వతి అందాల సుందరి డాక్టర్ మాలినీ దాసరి కి నూలు వస్త్రం తో, ప్రకృతి ఆధారిత రంగులతో నెసిన శాలువా కప్పి సత్కరించారు. అనంతరం సంకల్ప కళా గ్రామం వ్యవస్థాపకులు ఆకుల చలపతిరావు, కళా గ్రామం ద్వారా పర్యావరణ చైతన్యం ప్రజల్లో వ్యాప్తి చేస్తున్న జమీలియా, ప్రకృతి రైతు నరేష్, ఏక్షన్ ఎయిడ్ సంస్థ ప్రతినిధి ఐ కృష్ణ కుమారి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, సమన్వయకర్త భాస్కర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సంస్థ సిబ్బంది, అభిమానులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story