Visakhapatnam: గిరిజన విద్యార్థుల తరలింపు, నాయకుల అరెస్ట్‌లపై సీపీఎం నిరసన
Visakhapatnam: గిరిపుత్రుల శాంతియుత పోరాటానికి మద్దతుగా కొమ్మాదిలో సీపీఎం నిరసన తెలిపింది. అరెస్టులు ఆపి మారికవలసలోనే విద్యను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
Visakhapatnam: గిరిజన విద్యార్థుల తరలింపు, నాయకుల అరెస్ట్‌లపై సీపీఎం నిరసన
విశాఖపట్నం: గిరి పుత్రుల న్యాయమయిన శాంతి యుత పోరాటానికి,శాంతి యుతంగా మద్దతు తెలుపుతున్న ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేయడం నిర్బంధించడం ఆపాలని సిపిఎం జోన్ కమిటీ డిమాండ్ చేసింది.గిరిజన బిడ్డల విద్యను కాపాడాలని,అరెస్టులను ఖండిస్తూ మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం కొమ్మాది కూడలి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్ల కార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గిరిజన విద్యార్థులను బలవంతంగా తరలించడం దుర్మార్గం అని అన్నారు. గిరిజన విద్యార్థులకు వాళ్లు ఇంతకాలం చదువుతున్న తమ విద్య సంస్థలోనే కొనసాగాలని కోరే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. తమ పాఠశాలకు పంపించమణి కోరిన విద్యార్థులు, తల్లిదండ్రులు కోరడం తప్పని ప్రశ్నించారు.
కనీసం వారి అభిప్రాయాన్ని కూడా కూటమి ప్రభుత్వం గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తరలించిన విద్యార్థులను తీసుకొచ్చి మారికవలస లో వారి గురుకులంలోని యధా స్థితి లో విద్య ను కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గిర పుత్రుల సహనాన్ని పరీక్షించిన మంచిది కాదని హితవు పలికారు.వారి ఆవేదనను గౌరవించాలని,నిర్బంధాలకు, పోలీస్ మొహరింపు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులక డి అప్పలరాజు,పీ రాజుకుమార్, పీ రాజశేఖర్, ఎల్ పద్మ, జీ మంగశ్రీ,ఎస్ రామప్పడు,ఓ పూర్ణ,సీహెచ్ శేషుబాబు,డి తులసి, తదితరులు పాల్గొన్నారు.




