Visakhapatnam: 92వ వార్డులో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
Visakhapatnam: వెంకటాపురం 92వ వార్డులో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నివారించి పర్యావరణాన్ని కాపాడాలని జనసేన నేత బెహరా భాస్కర రావు పిలుపు.
Visakhapatnam: 92వ వార్డులో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
విశాఖపట్నం: ఈరోజు 92 వ వార్డు వెంకటాపురం మూడు గుళ్ళు దగ్గర ధవళ గోపాల్ గారి ఆధ్వర్యంలో వినాయకుని మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ నాయకులు బెహరా భాస్కర రావు గారు విచ్చేసి ఆయన చేతుల మీదుగా వినాయకుని మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకులకు బదులు మట్టి వినాయకులను పూజించాలని, మట్టి విగ్రహాల వల్ల సముద్ర కాలువలు చెరువులలో కాలుష్యం తగ్గుతుందని, జలచరాలకు హాని జరగదని తెలిపారు. ప్రజలందరూ మట్టి వినాయకులనే వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ధవళ మోహన్, బండారు నాగేశ్వరరావు, నీలాపు మహాలక్ష్మి రెడ్డి, కంపర కోటేశ్వరరావు, ధవళ మారయ్య, నమ్మి రమణ కంచిపాటి శంకర్రావు, నాగవర ప్రసాదు, బలిరెడ్డి శ్రీను, బల్ల రమణ, కంపర రమణ, అట్టా శంకర్, కంచిపాటి మురళి, గొంతిన శ్రీనివాసరావు, ఇల్లపు సురేష్, మనోహర్, ఇల్లపు సత్యనారాయణ, నరేష్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




