Visakhapatnam: విశాఖ దక్షిణంలో నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

Visakhapatnam: విశాఖ దక్షిణ నియోజకవర్గం నేతాజీ నగర్‌లో నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.

JAI RAM, MADURAWADA
Published on: 4 Sept 2026 4:18 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ దక్షిణంలో నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

విశాఖపట్నం: విశాఖ దక్షిణ నియోజకవర్గం 34వ వార్డు నేతాజీ నగర్‌లో శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ... ప్రజల ఆకాంక్షలు, స్థానిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో అవసరమైన అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు.

“రాబోయే రోజుల్లో దక్షిణ నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే మా ప్రధాన లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి వార్డులో అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు, నేతాజీ నగర్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA

Next Story