Visakhapatnam: దువ్వాడ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ శంఖబ్రత బాగ్చి!

Visakhapatnam: విశాఖ సీపీ డా. శంఖబ్రత బాగ్చి దువ్వాడ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 28 Aug 2026 3:06 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: దువ్వాడ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ శంఖబ్రత బాగ్చి!

Visakhapatnam: నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఈ రోజు దువ్వాడ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ మొత్తం నిశితంగా పరిశీలించారు , స్టేషన్ ఆనుకొని ఉన్న ఖాళీ ప్రాంతాలను వ్యర్థాలతో నింపకుండా, ఆయా ఖాళీ ప్రాంతాలను శుభ్రము చేయించాలని ఆదేశించారు, మరుగుదొడ్లను ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనీ ఆదేశించారు, స్టేషన్ నందు ఎల్లవేళలా తగు సిబ్బంది అందుబాటులో ఉండాలనీ ఆదేశించారు, పెండింగ్ కేసులు తక్షణం పరిష్కరించాలని తెలిపారు, అన్ని రిజిస్టర్లు ఎల్లవేళలా అప్డేట్ గా ఉండాలని ఆదేశించారు.

అనంతరం స్టేషనుకు ఫిర్యాదులకు వచ్చే ఫిర్యాదుదారులతో స్పందిస్తున్న తీరు తెలుసుకొని , ఫిర్యాదుదారులకు మర్యాద ఇస్తూ వారి సమస్యలను కూర్చోబెట్టి వినాలని, వాటిని పారదర్శకముగా విచారణ చేసి త్వరితగతిన పరిష్కారించాలని తెలిపారు, రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ యొక్క ప్రతి కదలిక ఎల్లవేళలా పరిశీలించాలనీ, గంజాయి రవాణాదారులను అరెస్టు చేయాలనీ, స్టేషన్ల పరిధిలో ఒక్క గంజాయి పెడ్లర్ కూడా ఉండరాదని స్పష్టమైన అదేశాలు జారీ చేశారు,

విధులలో ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకోబడతాయనీ కావునా ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని ఈ సందర్భముగా తెలియ జేశారు .

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story