Anandapuram: గంభీరం రిజర్వాయర్‌లో యువకుడి ఆత్మహత్య!

Anandapuram: గంభీరం రిజర్వాయర్‌లో దూకి విజయవాడకు చెందిన సందీప్ (30) ఆత్మహత్య. భీమిలీ ఆస్పత్రికి మృతదేహం తరలింపు, విచారణ చేపట్టిన ఆనందపురం పోలీసులు.

SHIVA, BHIMILI
Published on: 5 Sept 2026 3:25 PM IST
Anandapuram
X

Anandapuram: గంభీరం రిజర్వాయర్‌లో యువకుడి ఆత్మహత్య!

Anandapuram: ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్‌లో గల్లంతైన యువకుడు మృతిచెందాడు.పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన శ్రీరామినేని సందీప్ (30) నగరంలోని మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో నివాసముంటున్నాడు. మనస్తాపంతో శనివారం గంభీరం డ్యామ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గాలింపు చేపట్టిన పోలీసులు డ్యామ్‌లో మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భీమిలీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆనందపురం సీఐ వి.ఎర్రం నాయుడు తెలిపారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story