Visakhapatnam: 'అభినవ విమర్శకు మార్గదర్శి కట్టమంచి' గ్రంథావిష్కరణ!

Visakhapatnam: ఆచార్య వెలమల సిమ్మన్న రాసిన 'అభినవ విమర్శకు మార్గదర్శి కట్టమంచి' గ్రంథాన్ని ఆవిష్కరించిన పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

SHIVA, BHIMILI
Published on: 4 Sept 2026 6:34 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: 'అభినవ విమర్శకు మార్గదర్శి కట్టమంచి' గ్రంథావిష్కరణ!

Visakhapatnam: తిమ్మాపురం విజ్ఞాన విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆచార్య వెలమల సిమ్మన్న రాసిన "అభినవ విమర్శకు మార్గదర్శి కట్టమంచి" అనే గ్రంథాన్ని భారత ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు. పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి ఈరోజు ఆచార్య వెలమల సిమ్మన్న రాసిన మంచి గ్రంథాన్ని ఆవిష్కరించడం శుభపరిణామం.

ఆంధ్ర విశ్వ కళాపరిషత్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం కావడానికి డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు చేసిన సేవలు అమోఘం, అద్వితీయం అని అన్నారు.సిమ్మన్న సింహం.సిమ్మన్న సాహిత్య సింహంలా మాట్లాడారు .అలాగే కట్టమంచి రామలింగారెడ్డి విమర్శ గ్రంథం ఉంది. శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, ప్రామాణికంగా సిమ్మన్న ఈ విమర్శ గ్రంథం రాశారు.వారికి అభినందనలు.

ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు ,100 సంవత్సరాల పండుగను ఇటీవలన దిగ్విజయంగా చేసుకుంది.రామలింగారెడ్డి ప్రమాణ ఆంధ్రా విశ్వ కళాపరిషత్ ప్రమాణ స్వీకరణ చేసి వంద సంవత్సరాలు అయింది. సిమ్మన్న రాసిన ఈ గ్రంథం 100 గ్రంథము అవ్వడం చాలా ఆనందకరమైన విషయము.

సిమ్మన్న రాసినటువంటి ఈ గ్రంథము భావితరాలవారికి ఉపయోగపడుతుంది. తెలుగు భాషను కాపాడుకోవాల్సినటువంటి అవసరం అందరి మీద ఉన్నది. తెలుగు భాష చాలా గొప్ప భాష చాలా విశిష్ట భాష ఈ భాషను అందరము నేర్చుకొని తెలుగు భాషకు గౌరవాన్ని కల్పించాలి అని అన్నారు. కట్ట మంచివారు చరిత్రలో నిలిచిపోయినటువంటి మహనీయులు అని వెంకయ్య నాయుడు గారు అన్నారు .

కట్టమంచి వారు ముసలమ్మ మరణం,నవయామిని కవితత్త్వ విచారం, అర్థశాస్త్రము,పంచమి, వ్యాస మంజరి మొదలైన గ్రంధాలు రాసి ఆధునిక యుగానికి యుగపురుషుడు అయ్యారు అని వెంకయ్య నాయుడు గారు తెలిపారు.

నేటి సభకు సభాధ్యకులు అయిన ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గారు మాట్లాడుతూ సిమ్మన్న గ్రంథాలు వివిధ పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ గ్రంథము కూడా చాలా ప్రామాణికమైనది.సిమ్మన్న వందో గ్రంథం ఇది. పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించడం చాలా సంతోషకరం. నేను ఈ సభాముఖంగా కోరుకునేది ఏంటంటే విజ్ఞాన విద్యాసంస్థలు ప్రతినెల తప్పనిసరిగా భాష సాహిత్యానికి సంబంధించి ఒక ఉపన్యాసం మీరు ఏర్పాటు చేయాలి.

ఎందుకంటే మీ విద్యార్థులకి భాష మీద సాహిత్యం మీద పట్టు సాధించాలంటే ప్రతి నెల ఒక ఉపన్యాసము పెట్టి వాళ్లకు భాషపై, సాహిత్యపై మక్కువ పెరిగేటట్టు చూడాలి అని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు అన్నారు.

ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు ఈరోజుకి కూడా దేదిప్యమానంగా ఉండడానికి ప్రధాన కారకులు కట్టమంచి రామలింగారెడ్డి గారు అని ఆచార్య లక్ష్మి ప్రసాద్ గారు అన్నారు. జ్ఞాన సంపద చాలా గొప్పది. విద్యార్థులు అందరూ జ్ఞానాన్ని సంపాదించాలి అని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు అన్నారు.

విజ్ఞాన విద్యాసంస్థల సీఈవో శ్రీకాంత్ గారు మాట్లాడుతూ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు మాకు మంచి అవకాశం ఈ సభ పెట్టుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు.అలాగనే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా సిమ్మన్న గారి పుస్తకము ఆవిష్కరణ అవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా విద్యార్థులకి మీ ఉపన్యాసాలు ఎంతో స్ఫూర్తిని ప్రేరణ కలుగ చేస్తాయని శ్రీకాంత్ గారు అన్నారు

తెలుగు శాఖాధిపతి ఆచార్య జెర్రా అప్పారావు గారు మాట్లాడుతూ కట్టమంచి రామలింగారెడ్డి వలన ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకుంది.విద్యా ప్రమాణాలతో విద్యను ప్రసాదించినటువంటి మహనీయులు కట్టమంచి అని ఆచార్య జర్రా అప్పారావు గారు అన్నారు. డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు 1926-1930,1936-1949 రెండు సార్లు ఆంధ్ర విశ్వ కలపరిసత్ కు వైస్ ఛాన్సలర్ గా పని చేశారు.ప్రపంచ మేధావులను తెచ్చి విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలు ఇప్పించారు. సిమ్మన్న రాసినటువంటు గ్రంథాలు పోటీ పరీక్షలకు ఎంతగానో సహాయ పడతాయి అని వివరించారు ఆచార్య జర్రా అప్పారావు గారు .

శతాబ్ది గ్రంథకర్త ఆచార్య వెలమల సిమ్మన్న గారు మాట్లాడుతూ ఆచార్యులకే ఆచార్యులు కట్టమంచి రామలింగారెడ్డి గారు అన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి గారు భారతీయ అలంకారిక శాస్త్రవేత్తలు అయినటువంటి భరతుడు, దండి,విశ్వనాథుడు,మమ్ముటుడు, జగన్నాథ పండితురాయలు, భోజుడు , మొదలైన వారి గురించి అధ్యయనం చేయడమే కాకుండా పాశ్చాత్యల విమర్శ సిద్ధాంతాలను తెలుగు సాహిత్యానికి అన్వయించి సుసంపన్నం చేశారు. అత్యంత ఆధునికుడు కట్టమంచి. ఆధునిక మేధావి కట్టమంచి. వైతాళికలు కట్టమంచి అని సిమ్మన్న గారు అన్నారు.

ఈ సభకు ఆహ్వానం పలికిన వారు విజ్ఞాన విద్యాసంస్థల ప్రిన్సిపల్ పూర్ణిమ గారు .వందన సమర్పణ ఆచార్య నల్లా సత్యనారాయణ గారు చేశారు. ఈ సభను ఏర్పాటు చేసిన వారు తిమ్మాపురం విజ్ఞాన విద్యాసంస్థలు వారు. ఈ సభలో తెలుగు శాఖ ,హిందీ శాఖ విద్యార్థులు, పరిశోధకులు ,ఆచార్యులు హాజరయ్యారు. అంతేకాక విశాఖపట్నం సాహిత్య అభిమానులు ,భాషా అభిమానులు ఈ సభకు హాజరయ్యారు. సభ దిగ్విజయంగా జరిగింది.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story