Visakhapatnam: విశాఖ ఆరిలోవలో 'జెనివిస్ రెమిడీస్ తొలి స్టోర్ ఓపెనింగ్!

Visakhapatnam: ఆరిలోవ తోట గరువు జంక్షన్ లో తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందులు అందించే 'జెనివిస్ రెమిడీస్' తొలి స్టోర్ ను ఎమ్మెల్యే వేలగపూడి రామకృష్ణ బాబు ప్రారంభించారు.

SHIVA, BHIMILI
Published on: 23 July 2026 8:18 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ ఆరిలోవలో 'జెనివిస్ రెమిడీస్ తొలి స్టోర్ ఓపెనింగ్!

విశాఖపట్నం: ప్రజలకు తక్కువ ధరలోనే నాణ్యమైన జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా 'జెనివిస్ రెమిడీస్' (Genivis Remedies) తన మెడిసిన్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. విశాఖపట్నంలోని ఆరిలోవ తోట గరువు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన మొట్టమొదటి జెనివిస్ రెమిడీస్ స్టోర్‌ను స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేలగపూడి రామకృష్ణ బాబు ముఖ్య అతిధిగా గా హాజరై ఘనంగా ప్రారంభించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ— దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ల ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా ఈ స్టోర్‌ను ప్రారంభించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు.

​జెనివిస్ రెమిడీస్ నిర్వాహకుల రమేష్ మరియు సాయి ఫనిద్రా వివరాలు వెల్లడిస్తూ:

​"జెనివిస్ రెమిడీస్ స్టోర్లలో బ్రాండెడ్ మందులతో సమానమైన నాణ్యత కలిగిన 5,000 పైచిలుకు జనరిక్ మందుల శ్రేణి అందుబాటులో ఉంటుంది. వీటి కొనుగోలుపై ప్రజలు ఏకంగా 80% వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు. తక్కువ ధరకే నాణ్యమైన ఔషధాలను సామాన్యులకు అందించడమే మా ప్రధాన ధ్యేయం అన్నారు...

ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసే మందుల్లో కొన్ని రకాలు ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉందని, ఈ విషయమై గత నెలలో దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల యాజమాన్యాలు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాయని నిర్వాహకులు గుర్తుచేశారు. ఆన్‌లైన్ మందుల ప్రమాదాల బారిన పడకుండా, నేరుగా విశ్వసనీయమైన జెనివిస్ రెమిడీస్ స్టోర్ల ద్వారా నాణ్యమైన మందులను తక్కువ ధరకు పొందాలని ప్రజలకు సూచించారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలు,మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story