Chodavaram: రంగా అందరి మనసుల్లో చిరస్థాయిగా ఉంటారు: వైసిపి నేత!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని అన్నవరం గ్రామంలో వంగవీటి మోహన రంగా జన్మదిన వేడుకలు భారీగా జరిగాయి.
Chodavaram: రంగా అందరి మనసుల్లో చిరస్థాయిగా ఉంటారు: వైసిపి నేత!
చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని అన్నవరం గ్రామంలో అనకాపల్లి జిల్లా వైసిపి యువజన విభాగ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ ఆధ్వర్యంలో వంగవీటి రంగా జన్మదిన వేడుకలు భారీ స్థాయిలో నిర్వహించారు.
ఈ సందర్భంగా పుల్లేటి వెంకటేష్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా కాపు జాతిలో పుట్టినా బడుగు బలహీన వర్గాల కోసం జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు.
వంగవీటి మోహన రంగా ఒక కులానికి చెందిన నాయకుడు కాదని రాష్ట్రంలో అన్ని కులాల నుంచి రంగా అభిమానులు ఉండడమే దీనికి నిదర్శనం అని ఈ సందర్భంగా తెలిపారు.
వంగవీటి రంగ రాజకీయంగా ఎదిగితే తమకు భవిష్యత్తు ఉండదని భావించిన కొన్ని రాజకీయ శక్తులు రంగా గారిని కుట్ర చేసి చంపారని.... భౌతికంగా వంగవీటి రంగాను తమకు దూరం చేసినా అందరి మనసులలో చిరస్థాయిగా నిలచిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని ఈ సందర్భంగా తెలిపారు
వంగవీటి మోహన్ రంగా జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పలువురు శుభాకాంక్షలు తెలుపుకున్నారు
ఈ కార్యక్రమంలో పుల్లేటి వెంకటేష్, దేవరపల్లి సత్య, ఓరుగంటి నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.




