Anakapalle: శంకరం వద్ద పల్టీ కొట్టిన లారీ.. నలుగురికి తీవ్ర గాయాలు!

Anakapalle: అనకాపల్లి మండలం శంకరం గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Updated on: 3 Aug 2026 10:35 AM IST
Anakapalle
X

Anakapalle: శంకరం వద్ద పల్టీ కొట్టిన లారీ.. నలుగురికి తీవ్ర గాయాలు!

Anakapalle: అనకాపల్లి మండలం శంకరం గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక లారీని మరో లారీ ఓవర్‌టేక్ (క్రాస్) చేసే ప్రయత్నంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.

ప్రమాదంలో ఒక లారీ జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్డువరకు పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి, కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే రహదారికి అడ్డంగా పడింది. దీంతో ఆ మార్గంలో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో లారీ కూడా తీవ్రంగా దెబ్బతింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెండు భారీ క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన లారీలను రోడ్డుపక్కకు తరలించే పనులు చేపట్టారు. ప్రమాదంలో రెండు లారీల్లో ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story