Araku: గిరిజన కళాకారులకు శిక్షణ తరగతులు: అరకులో ఘనంగా ప్రారంభం!

Araku: అరకులో గిరిజన కళాకారుల కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను మిషన్ డైరెక్టర్ డాక్టర్ మందారాణి ఘనంగా ప్రారంభించారు.

SAI, PADERU
Published on: 8 Sept 2026 6:08 PM IST
Araku
X

Araku: గిరిజన కళాకారులకు శిక్షణ తరగతులు: అరకులో ఘనంగా ప్రారంభం!

అల్లూరి జిల్లా: పాడేరు/అరకు గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణా మిషన్ (గిరిజన సంక్షేమ శాఖ, విశాఖపట్నం) మరియు ఐటిడిఎ (పాడేరు) సంయుక్త ఆధ్వర్యంలో, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (న్యూఢిల్లీ) సహకారంతో గిరిజన కళాకారులకు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు సెప్టెంబర్ 07వ తేది. నుండి 12 వ తేది వరకుజరగనున్న శిక్షణ కార్యక్రమలు ప్రారంభమయ్యాయి.

ఈ శిక్షణ అరకువ్యాలీలో ట్రైబల్ మ్యూజియం, మాడగడ, ముసిరిగూడ లో కార్యక్రమాన్ని మిషన్ డైరెక్టర్ Dr. మందా రాణి అధికారికంగా ప్రారంభించారు.

ఈ శిక్షణా తరగతులను మూడు వేర్వేరు ప్రాంతాలలో నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.అరకు గిరిజన మ్యూజియంలో లక్క బొమ్మలు, హస్తకళలు, గాజుల తయారీ, బుద్ధు సాంప్రదాయ కళలు, సవర ఆర్ట్ శిక్షణ ప్రారంభం,

అలాగే మాడగడ గ్రామంలో టెర్రకోట ఆర్ట్ (కుండలు మరియు వివిధ మట్టి కళాకృతుల తయారీ) శిక్షణ, ముసిరిగూడ గ్రామంలో వెదురు (బ్యాంబూ)హస్తకళాకృతుల తయారీ శిక్షణ, కళాకారులకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ఇతర రాష్ట్రాల నుండి నిపుణులను రప్పించామని ఛత్తీస్‌గఢ్ నుండి వెదురు క్రాఫ్ట్, ఒడిశా నుండి టెర్రకోట పాటరీ, రాజస్థాన్ నుండి వచ్చిన వారు లక్క ఆర్ట్ నిష్ణాతులు వారు స్థానిక గిరిజన కళాకారులకు ప్రత్యక్ష శిక్షణ ఇస్తున్నారని వివరించారు .

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు Dr. నాగరాజు చిక్కాల (ప్రొఫెసర్), శ్రీ కాట్రగడ్డ శ్రీనివాస వరప్రసాద్ (అసోసియేట్ ప్రొఫెసర్)లతో పాటు శ్రీ N. మురళి కృష్ణ ప్రసాద్, G. గణపతి నాయుడు, పిచ్చయ్య నాయుడు మరియు అరకు గిరిజన మ్యూజియం సిబ్బంది పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU

Next Story