Thagarapuvalasa: అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం
Thagarapuvalasa: తగరపువలస అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో నేషనల్ స్పేస్ డే పురస్కరించుకుని అంతరిక్ష సాంకేతికతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహణ.
Thagarapuvalasa: అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం
తగరపువలస: అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 23rd ఆగష్టు 2026 నేషనల్ స్పేస్ డే సందర్భంగా అన్సుమి స్పేస్ క్రాఫ్ట్ మాను్ఫాక్చరింగ్ సైంటిస్ట్ అన్వర్ షరీఫ్, COO అండ్ కో - ఫౌండర్, డిజిటల్ ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్ & ఇరు 4.O మరియు ఇన్స్టిట్యూట్స్ ఇన్నోవేషన్ సెల్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్, కెరీర్ రెడీనెస్ టీమ్ సమన్వయముతో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ ఇన్నోవేటీంగ్ స్పేస్ : బిల్డింగ్ స్పేస్ క్రాఫ్ట్, మిషన్ లాంవ్ వెహికల్ సిస్టమ్స్ విత్ ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్ పవర్డ్ ఇంటలిజెన్స్ ప్లాట్ ఫారమ్, స్పేస్ క్రాఫ్ట్ డెవలప్మెంట్, మిషన్ లాంచ్ వెహికల్ సిస్టమ్స్, గ్లోబల్ స్పేస్ సొల్యూషన్స్ అనే అంశంపైన అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారముతో భోగాపురం లో అన్సుమి ఆర్యభట్ట మాను్ఫాక్చరింగ్ యూనిట్ ప్రారంభము గురించి .విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అంతరిక్ష పరిశోధనలు, స్పేస్‌క్రాఫ్ట్ నిర్మాణం, లాంచ్ వెహికల్ సిస్టమ్స్, ఉపగ్రహాల ప్రయోగ విధానం, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో జరుగుతున్న నూతన ఆవిష్కరణల గురించి విద్యార్థులకు వివరించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సాధిస్తున్న విజయాలు, చంద్రయాన్, మంగళయాన్ వంటి ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాల గురించి కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అంతరిక్ష రంగంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉన్న విస్తృతమైన అవకాశాలను వివరించి, భవిష్యత్‌లో స్పేస్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఉపగ్రహ సాంకేతికత మరియు రాకెట్ వ్యవస్థల అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని కార్యక్రమంలో సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అంతరిక్ష సాంకేతికతకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల యాజమాన్యం విజయవంతంగా నిర్వహించారు, ప్రిన్సిపాల్, డాక్టర్ బి. మురళీకృష్ణ, డైరెక్టర్ డాక్టర్ ఏ. చంద్రశేఖర్ గారు, కో ఆర్డినేటర్స్ డా. ఎస్. హెచ్. షరీఫ్ గారు, ప్రో. అడపా వెంకటేశ్వరరావు, హెడ్ ఆఫ్ సిఆర్టి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




