Visakhapatnam: విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికులకు 'తెలుగు శక్తి' మద్దతు!
Visakhapatnam: విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికులకు తెలుగు శక్తి బి.వి.రామ్ మద్దతు. అభివృద్ధి పేరుతో కార్మికులను రోడ్డున పడేయడం సరికాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Visakhapatnam: విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికులకు 'తెలుగు శక్తి' మద్దతు!
Visakhapatnam: గాంధీజీ నిజమైన స్వాతంత్ర్యం కోసం పోరాడారు. స్వాతంత్ర్యం వచ్చిన భారతదేశంలోనే ప్రజలు స్వేచ్ఛ లేకుండా, తమ హక్కుల కోసం రోడ్ల మీదకు రావాల్సి వస్తే, ఇది దేశానికి శోచనీయమైన పరిస్థితి. గాంధీజీ చెప్పినట్టు చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి అన్నారు. కానీ ఈరోజు గాంధీజీ సిద్ధాంతాలను ఈ కార్మికులే పాటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖపట్నం ఎయిర్‌పోర్టు కార్మికులకు మద్దతుగా తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ గురువారం ఉదయం మహాత్మా గాంధీకి పూలదండలు వేసి అనంతరం విలేకరులతో మాట్లాడారు. "మేము ఒక్కటే అడుగుతున్నాం.
చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఉన్నవాటిని మూసేయడమా? ఈరోజు అభివృద్ధి పేరుతో విధ్వంసం చేస్తున్నారు. గత ఇరవై సంవత్సరాలుగా పనిచేసిన ఈ కార్మికులు ఈరోజు రోడ్డున పడితే వీళ్లు ఎలా బతకాలి? చంద్రబాబు నాయుడు గారూ, మీరు మీ స్వార్థం కోసం చూసుకున్నారు తప్ప ప్రజల కోసం చూడటం లేదు.
కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్నారే తప్ప సామాన్య ప్రజలను పట్టించుకోవడం లేదు" అని మండిపడ్డారు." ‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు’ అని చెప్పే మీరు ఈ రోజు ప్రజల పరిస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదు? మేము ఒక్కటే కోరుతున్నాం.
చంద్రబాబు నాయుడు గారూ, ఈ పార్లమెంట్ సాక్షిగా, వీరికి న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇది చివరి అవకాశం. తక్షణమే వీరికి న్యాయం చేయాలని తెలుగు శక్తి డిమాండ్ చేస్తోందన్నారు. మహిళలను లక్షాధికారులను చేస్తానని చెప్పి, మహిళలను రోడ్డు మీదకు లాగేశారన్నారు.
"నాడు ఈ దేశానికి ఒక మహిళ, ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. నేడు మీ ప్రభుత్వ హయాంలో మహిళల బ్రతుకులు రోడ్డు పాలయ్యయన్నారు. కార్మికులు తమ హక్కుల కోసం మాట్లాడుతుంటే, వాళ్లను వైసీపీ నడిపిస్తుందని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇలా మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు సిగ్గుండాలి.
కార్మికులు కడుపు మండిపోయి తమ సమస్యల కోసం పోరాడుతుంటే, దానిలో కూడా రాజకీయ కోణం చూడడం సరైనది కాదు" అన్నారు. ప్రతి విషయంలోనూ రాజకీయాన్ని తీసుకురావడం సరికాదన్నారు. 34 సంవత్సరాల నాటి విషయాలను ప్రస్తావిస్తూ, ప్రజల అసలు సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రతి సమస్యను డైవర్ట్ చేయడం ప్రజలను మోసం చేయడమే అన్నారు.
తెలుగు శక్తి డిమాండ్స్:
కార్మికులకు న్యాయం జరగాలి. విశాఖపట్నం డొమెస్టిక్ ఎయిర్‌పోర్టును కొనసాగించాలి. ఇది ప్రజల ఆకాంక్ష. విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేలు ఈ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదు? గతంలో ఇతర సందర్భాల్లో చేసిన విధంగా వీరి సమస్యను కూడా పరిష్కరించాలి.
‘అక్కడ పని పెడతాం, ఇక్కడ పని పెడతాం’ అని చెప్పడం కాదు. ఇన్నాళ్లు సేవ చేసిన కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పించి, వారి సేవకు తగిన గ్రాట్యుటీ, పరిహారం అందించాలి. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నారో తెలియడం లేదు.
"పవన్ కళ్యాణ్ సభల్లో మాట్లాడేటప్పుడు మహిళలకు ఎక్కడ అన్యాయం జరగకుండా నేను అండగా ఉంటానని చెప్పిన పెద్ద మనిషి, ఇప్పుడు ఇక్కడ అన్యాయం జరుగుతుంటే ఎక్కడ దాక్కున్నారో తెలియడం లేదు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని కోరుతున్నామన్నారు.
"తెలుగు శక్తి తరఫున ఒక అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా, మనవడిగా, వారి మనిషిగా మేము ఈ కార్మికుల పక్షాన నిలబడతాం. చంద్రబాబు నాయుడు గారు ప్రజల కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటామని ప్రమాణం చేసిన మీరు ఈరోజు ప్రజలను మోసం చేయడం సరికాదు. తెలుగు శక్తి కార్మికులకు అండగా నిలబడటం తప్ప ఎవరికీ భయపడమని తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ స్పష్టం చేశారు.
ఎయిర్పోర్ట్ కార్మికులతో బివి రామ్ పాదయాత్ర చేసుకుంటూ విశాఖ తొలి మేయర్ ఎన్.ఎస్.ఎన్. రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ను కార్మికులతో కలిసి ఆయన కార్యాలయంలో కలిసి కార్మికుల సమస్య వివరించడం జరిగిందని తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ తెలియజేశారు.




