Chodavaram: చోడవరంలో సింధూర అలంకరణలో స్వయంభూ గణపతి దర్శనం!

Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం స్వయంభూ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో గణపతి నవరాత్రుల 2వ రోజు సింధూర అలంకరణలో కార్యసిద్ధి గణపతిగా దర్శనమిచ్చిన స్వామివారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 15 Sept 2026 12:54 PM IST
Chodavaram
X

Chodavaram: చోడవరంలో సింధూర అలంకరణలో స్వయంభూ గణపతి దర్శనం!

Chodavaram: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరం లో స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు లో 2వ రోజు మంగళవారం స్వామివారు సింధూర అలంకరణలో కార్యసిద్ధి గణపతిగా దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కొడమంచిలి చలపతిరావు శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం స్వామివారికి సింధూర పూజ, అభిషేకాలు నిర్వహించారు. సింధూర వర్ణంలో గల స్వామివారిని అనేకమంది భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM