Simhachalam: సింహాచలంలో సెప్టెంబర్ 11న ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం!
Simhachalam: సింహాచలం దేవస్థానంలో సెప్టెంబర్ 11న ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం. 4 బ్యాచ్‌ల్లో పూజలు, ఎస్‌ఎంఎస్ ద్వారా టైమ్ స్లాట్ వివరాలు. ఈఓ వెంకట్రావు వెల్లడి.
Simhachalam: సింహాచలంలో సెప్టెంబర్ 11న ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం!
Simhachalam: మహిళా భక్తులకు నాలుగు విడతల్లో పూజలు.. ఎస్‌ఎంఎస్ ద్వారా టైం స్లాట్, వేదిక వివరాలు.
పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు. వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే మహిళా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పూజలను నాలుగు బ్యాచ్‌లుగా నిర్వహించనున్నారు.
పూజల సమయాలు:
మొదటి బ్యాచ్: ఉదయం 7.30 గంటలకు
రెండో బ్యాచ్: ఉదయం 9.30 గంటలకు
మూడో బ్యాచ్: ఉదయం 11.30 గంటలకు
నాలుగో బ్యాచ్: మధ్యాహ్నం 1.30 గంటలకు
పూజా కార్యక్రమాలు కళ్యాణ మండపం, పీఏసీ బిల్డింగ్, క్యూ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్‌లోని రెండు వేదికల్లో నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.
ఎస్‌ఎంఎస్ ద్వారా టైం స్లాట్, వేదిక వివరాలు
వరలక్ష్మీ వ్రతానికి నమోదు చేసుకున్న మహిళా భక్తులకు వారి మొబైల్ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా కేటాయించిన టైం స్లాట్, వేదిక వివరాలు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు తమకు వచ్చిన ఎస్‌ఎంఎస్‌లోని సమయం, వేదిక ప్రకారం మాత్రమే హాజరై దేవస్థానానికి సహకరించాలని కోరారు. వ్రతంలో పాల్గొనే భక్తులు ఆధార్ కార్డు ధృవీకరణ అనంతరం మాత్రమే అనుమతిస్తారు.
సామూహిక వరలక్ష్మీ వ్రతానికి అవసరమైన పూజా ద్రవ్యాలు, ప్రసాదాలను దేవస్థానం తరఫున ఉచితంగా ఏర్పాటు చేయనున్నట్లు ఈవో తెలిపారు. అయితే ఆచమనం కోసం అవసరమైన ఉద్దరిణి, పంచపాత్రలను భక్తులు స్వయంగా తీసుకురావాలి.
పూజ కోసం ఆసక్తి ఉన్న భక్తులు పుష్పాలను తమ వెంట తీసుకురావచ్చని సూచించారు. ఈ ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తులకు అంతరాలయ దర్శనం లభించదని అధికారులు స్పష్టం చేశారు.
వరలక్ష్మీ వ్రతం నిర్వహణకు సంబంధించి ఈరోజు స్వామివారి కళ్యాణ మండపంలోఏర్పాట్లపై అధికారులతో ఈవో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, ఇంజనీరింగ్ అధికారులు, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఆలయ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న సామూహిక వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, క్యూలైన్లు, పూజా సామగ్రి, వేదికల వద్ద ఏర్పాట్లు, విద్యుత్ తదితర అంశాలపై అధికారులకు ఈవో దిశానిర్దేశం చేశారు.
తమకు కేటాయించిన విధులను సంబంధిత అధికారులు, సిబ్బంది సకాలంలో పూర్తి చేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఈవో జల్లేపల్లి వెంకట్రావు మాట్లాడుతూ, శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహిస్తున్న ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహంతో పాటు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు.
భక్తులు తమ సెల్‌ఫోన్‌కు వచ్చిన ఎస్‌ఎంఎస్‌లోని టైం స్లాట్, వేదిక ప్రకారం మాత్రమే హాజరై దేవస్థానానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కార్యనిర్వహణాధికారి
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం, సింహాచలం.




