Visakhapatnam: ఏపీలో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక.. 46 మండలాల్లో అలర్ట్

Visakhapatnam: ఏపీలో 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం. మక్కువలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Updated on: 21 April 2026 7:10 AM IST
Visakhapatnam
X

Visakhapatnam

Visakhapatnam: విశాఖపట్నం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాల్పులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు మొత్తం 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉండే అవకాశం ఉండగా, మరో 19 మండలాల్లో వడగాల్పులు కొనసాగనున్నట్లు తెలిపింది.

ప్రత్యేకంగా బూర్జు, హీరమండలం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపనున్నాయని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, నిన్న మన్యం జిల్లా మక్కువ మండలంలో 44.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు అత్యవసర అవసరాలు తప్ప బయటకు వెళ్లకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story