Chodavaram: బుచ్చింపేటలో ఘనంగా వినాయక చవితి 250 మందికి చీరల పంపిణీ!
Chodavaram: రోలుగుంట మండలం బుచ్చింపేటలో వినాయక చవితి వేడుకలు. 250 మంది మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేసిన వార్డు సెక్రటరీ అనిమిరెడ్డి రమణ.
Chodavaram: బుచ్చింపేటలో ఘనంగా వినాయక చవితి 250 మందికి చీరల పంపిణీ!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధి లోని రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ మరియు మినీ కైలాసగిరి యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ ఘనంగా నిర్వహించటం జరిగింది. దీనిలో భాగంగా ప్రజలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసి, ప్రత్యేకంగా యూత్ సభ్యులకు నిర్వహణ లో అభినందనలు తెలియజేస్తూ ,ఇదే గ్రామానికి చెందిన అనిమిరెడ్డి రమణ (వార్డు సెక్రటరీ) పూజా కార్యక్రమం కి హాజరు అయిన సుమారు 250 కి పైగా మహిళలు కు సుమారు 60వేల రూపాయల తన సొంత నిధులతో చీరలు పంపిణీ చేయటం జరిగింది.
ఈ కార్యక్రమం పట్ల మరియు రమణ గారి సేవా కార్యక్రమాలు పట్ల యూత్ సభ్యులు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అనిమిరెడ్డి రమణ మాట్లాడుతూ మన హిందువులకు ముఖ్యంగా తొలి పూజ అయిన వినాయకునికి చేసే వినాయక చవితి ప్రజలందరికీ సుఖ సంతోషాలతో పాటు ముఖ్యంగా రైతులందరికీ ఈ సంవత్సరం నుండి గట్టెక్కి విజ్ఞాలకు అధిపతి అయిన గణపతి పంటలను సమృద్ధిగా పండించి రైతులను వినాయకుడు కాపాడతాడని మనస్పూర్తిగా ఆ గణనాథుడిని కోరుకుంటున్నాను అని తెలిపారు.
ప్రజలంతా మట్టి వినాయకుడిని పూజిస్తూ పర్యావరణానికి హితం చేయాలని డీజే లతో కూడిన రాణగొన ధ్వనుల ధ్వని కాలుష్యానికి ప్రజలంతా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.




