Anakapalli: నాలుగో రోజుకు చేరిన RECS పాలిటెక్నిక్ ఉద్యోగుల దీక్షలు!
Anakapalli: అనకాపల్లి RECS పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరాయి. బకాయి జీతాలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని సిబ్బంది ఆందోళన.
Anakapalli: నాలుగో రోజుకు చేరిన RECS పాలిటెక్నిక్ ఉద్యోగుల దీక్షలు!
Anakapalli: RECS పాలిటెక్నిక్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజూ కొనసాగుతున్నాయి. తమకు రావాల్సిన జీతాలు చెల్లించడంతో పాటు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ సిబ్బంది ఆందోళన కొనసాగిస్తున్నారు.
జీతాలు చెల్లించే వరకు, తమ డిమాండ్లను నెరవేర్చే వరకు రిలే నిరాహార దీక్షలను విరమించే ప్రసక్తే లేదని ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శరగడం హేమంత్ స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ రిలే నిరాహార దీక్షల్లో అసోసియేట్ ప్రిన్సిపాల్ కె. శివ, సెక్రటరీ బి. నగేష్తో పాటు RECS పాలిటెక్నిక్‌కు చెందిన మొత్తం 45 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి జీతాల చెల్లింపుతో పాటు తమ డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.




