Anakapalli: అనకాపల్లి కూటమి సభ గ్రాండ్ సక్సెస్.. తెరవెనుక అసలు హీరో ఈయనే!
Anakapalli: అనకాపల్లి విజయోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ వెనుక ఉన్న జనసేన పార్టీ ఇంచార్జ్ రామ్‌కి వ్యూహాలు ఇవే.
Anakapalli: అనకాపల్లి కూటమి సభ గ్రాండ్ సక్సెస్.. తెరవెనుక అసలు హీరో ఈయనే!
Anakapalli: అనకాపల్లిలో జరిగిన కూటమి విజయోత్సవ ర్యాలీ, ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ రాజకీయంగా విశేష చర్చకు దారితీసింది. వేలాది మంది కార్యకర్తలు, మహిళలు, కూటమి నాయకులతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోవడం వెనుక ఎవరి కృషి ఉందనే అంశం ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మార్గదర్శకత్వంలో జనసేన నాయకుడు రామ్‌కి నిశ్శబ్దంగా చేపట్టిన వ్యూహాత్మక ప్రణాళికలే ఈ భారీ విజయానికి కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సభకు రోజుల ముందే మండలాల వారీగా సమన్వయం, కార్యకర్తలతో నిరంతర సమావేశాలు, మహిళా బృందాల ఏర్పాట్లు, రవాణా ఏర్పాట్లు వంటి అంశాలను రామ్‌కి స్వయంగా పర్యవేక్షించినట్లు సమాచారం.
సభ ప్రారంభానికి ముందే అనకాపల్లి వీధుల్లో కనిపించిన జన సందోహం ఎన్నికల ప్రచార వాతావరణాన్ని తలపించింది.
ర్యాలీ విజయవంతం కావడానికి అవసరమైన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ రామ్‌కి ముందుండి నడిపించారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
రాజకీయ వేదికపై ఎక్కువగా కనిపించకపోయినా, క్షేత్రస్థాయిలో మాత్రం రేయింబవళ్లు కష్టపడే నాయకుడిగా రామ్‌కి గుర్తింపు పొందుతున్నారని కార్యకర్తలు అంటున్నారు. విజయోత్సవ సభ విజయంతో ఆయన నిర్వహణ సామర్థ్యం మరోసారి రుజువైందని పలువురు అభిప్రాయపడుతున్నారు.




