Bhogapuram: భోగాపురం ఎయిర్పోర్ట్ ఉద్యోగాల్లో స్థానికే తొలి పీఠం సీపీఐ
Bhogapuram: భోగాపురం విమానాశ్రయం ఉద్యోగాల్లో ఉత్తరాంధ్ర నిరుద్యోగులు, భూములు కోల్పోయిన రైతులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సీపీఐ నాయకుడు ఓమ్మి రమణ డిమాండ్ చేశారు.
Bhogapuram: భోగాపురం ఎయిర్పోర్ట్ ఉద్యోగాల్లో స్థానికే తొలి పీఠం సీపీఐ
విజయనగరం జిల్లా...
భోగాపురం విమానాశ్రయంలో ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి.
– సిపిఐ జిల్లా కార్యదర్శి ఓమ్మి రమణ.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పడే ఉద్యోగాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువతకు తొలి ప్రాధాన్యత కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఓమ్మి రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.విమానాశ్రయం నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతు కుటుంబాల త్యాగాన్ని గుర్తించి, వారి పిల్లలకు ప్రత్యేక ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.అలాగే స్థానిక యువతకు విమానయాన రంగానికి అవసరమైన నైపుణ్య శిక్షణను ఉచితంగా అందించి, ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిదిద్దాలని సూచించారు.విమానాశ్రయానికి సంబంధించిన కాంట్రాక్టులు, నిర్వహణ సేవలు, ఇతర ఉపాధి అవకాశాల్లో స్థానిక సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానికుల హక్కులు, ఉద్యోగాల కల్పన, పునరావాస ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.ఉత్తరాంధ్ర ప్రజల త్యాగాలతో నిర్మితమవుతున్న ఈ విమానాశ్రయం వల్ల కలిగే ప్రయోజనాలు ముందుగా స్థానిక ప్రజలకే దక్కేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని ఓమ్మి రమణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షులు వెలగాడ కృష్ణ. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న. దళిత హక్కుల పోరాట సమితి మండల నాయకులు కె.గణేష్ పాల్గొన్నారు.




