Anakapalle: అనకాపల్లిలో గర్భిణీ మృతి ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన!
Anakapalle: అనకాపల్లి సూర్య హాస్పిటల్లో గర్భిణీ మృతి చెందడంతో బంధువుల ఆందోళన. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి వద్ద నిరసన, న్యాయం చేయాలని డిమాండ్.
Anakapalle: అనకాపల్లిలో గర్భిణీ మృతి ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన!
Anakapalle: అనకాపల్లిలోని సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గొల్లగాని లావణ్య అనే గర్భిణీ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆమె బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
లావణ్యను ప్రసవం నిమిత్తం సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకురాగా, శుక్రవారం డెలివరీ నిర్వహించి అనంతరం అబ్జర్వేషన్లో ఉంచినట్లు బంధువులు తెలిపారు.
అయితే ఆమెకు బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని, ఇక్కడ మెరుగైన చికిత్స అందించడం సాధ్యం కాదంటూ విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం లావణ్యను కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ లావణ్య మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
మృతదేహాన్ని బంధువులు తిరిగి అనకాపల్లిలోని సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వద్దకు తీసుకువచ్చి, ఆసుపత్రి బయట ఉంచి ఆందోళన చేపట్టారు. లావణ్య ఆరోగ్య పరిస్థితి గురించి ముందుగానే తెలిసినప్పటికీ, సరైన సమయంలో ఎందుకు ముందస్తు చికిత్స అందించలేదని బంధువులు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఇవ్వాలని, తమకు న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది




