Bheemili: తప్పిపోయిన 5 ఏళ్ల బాలుడిని కాపాడిన భీమిలి పోలీసులు!

Bheemili: భీమిలిలో తప్పిపోయిన 5 ఏళ్ల బాలుడిని సురక్షితంగా రక్షించిన పోలీసులు. వెంటనే గాలించి తల్లిదండ్రులకు అప్పగించిన సీఐ దివాకర్ యాదవ్ బృందం.

SHIVA, BHIMILI
Published on: 14 Sept 2026 6:56 PM IST
Bheemili
X

Bheemili: తప్పిపోయిన 5 ఏళ్ల బాలుడిని కాపాడిన భీమిలి పోలీసులు!

Bheemili: తప్పిపోయిన 5 ఏళ్ల బాలుడిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించిన భీమిలి పోలీసులు - మానవత్వం చాటిన పోలీసులు.

గౌరవనీయులైన విశాఖపట్నం సిటీ పోలీస్ కమీషనర్ శ్రీ శంకబ్రత బగ్చి IPS గారి ఆదేశాల మేరకు ప్రజలకు సేవ చేయడంలో ముందుంటున్న భీమిలి సి.ఐ శ్రీ దివాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భీమిలి పోలీసులు మరో మంచి కార్యం చేశారు.

ఈరోజు 5 సంవత్సరాల బాలుడు తప్పిపోయాడని సమాచారం రావడంతో వెంటనే స్పందించిన భీమిలి పోలీసులు చుట్టుపక్కల గాలించి బాలుడిని సురక్షితంగా గుర్తించి రక్షించారు. అనంతరం బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడు తల్లిదండ్రుల వద్దకు చేరడంతో వారి ఆనందానికి అవధులు లేవు, భీమిలి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సి.ఐ గారు సూచించారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI