PM Palem: చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు - కొవ్వొత్తుల ప్రదర్శన
PM Palem: పీఎం పాలెంలో చంద్రబాబు 53 రోజుల నిర్బంధానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ 4వ వార్డు అధ్యక్షుడు గరే గురునాథ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ.
PM Palem: చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు - కొవ్వొత్తుల ప్రదర్శన
పీఎం పాలెం: ప్రజాసేవకు అంకితమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులతో అరెస్టు చేసి 53 రోజులపాటు నిర్బంధించడం నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని టీడీపీ ఆరో వార్డు అధ్యక్షుడు గరే గురునాథ్ అన్నారు. ఈ సందర్భంగా గరే గురునాథ్ ఆధ్వర్యంలో బుధవారం నాడు పిఎం పాలెం లో కొవ్వొత్తులు వెలిగించి నిజం గెలిచిందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 9 తెలుగు జాతి చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని చీకటి రోజుగా మిగిలిపోతుందనిపేర్కొన్నారు.చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసి నిర్బంధించిన అనంతరం రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు స్వచ్ఛందంగా ‘నిజం గెలవాలి’ అంటూ ఆయనకు మద్దతుగా నిలిచారని తెలిపారు. ప్రజల నుంచి లభించిన అపూర్వమైన మద్దతు చంద్రబాబుపై ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనమన్నారు.
ఎన్ని కుట్రలు, అవరోధాలు ఎదురైనా చంద్రబాబు నీతి, నిజాయితీ, ప్రజాసేవను ఎవరూ అణచివేయలేకపోయారని అన్నారు. న్యాయస్థానాల్లో నిజం గెలిచి, కేసులు నిలవకపోవడం ద్వారా ధర్మం, న్యాయం చివరకు గెలుస్తాయనే విషయం మరోసారి రుజువైందని పేర్కొన్నారు.చంద్రబాబు నిర్బంధ సమయంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఏకతాటిపైకి వచ్చి ఆయనకు మద్దతుగా నిలిచారని, ‘నిజం గెలవాలి’ కార్యక్రమాలు ప్రజల్లో ఆయనకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబించాయని తెలిపారు. అనంతరం చంద్రబాబు నిర్బంధం నుంచి విడుదల కావడం, న్యాయస్థానాల్లో కేసులకు ఎదురుదెబ్బ తగలడం నిజం గెలిచిన విజయంగా అభివర్ణించారు.
చంద్రబాబును అక్రమంగా నిర్బంధించిన సెప్టెంబర్ 9 నాటి ఘటన టీడీపీతో పాటు తెలుగు ప్రజల్లో చెరగని జ్ఞాపకంగా మిగిలిపోయిందన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజల చైతన్యం, సంఘీభావం కీలక పాత్ర పోషించాయని అన్నారు. చంద్రబాబు తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడని, రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషి, అందించిన సేవలు తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరో వార్డు బి సి సెల్ అధ్యక్షుడు రెడ్డి సత్యనారాయణ, వండ్రాసి అప్పలనాయుడు, కొప్పాక రామకృష్ణ, కొల్లి బాబ్జీ, పాప రెడ్డి, రమణ, లోకేష్, మేకల కృష్ణ ,పిల్లా రమేష్ తదితరులు పాల్గొన్నారు.




