Visakhapatnam: విశాఖ విమ్స్‌లో పీఎం జన్ ఔషధి కేంద్రం!

Visakhapatnam: విశాఖ విమ్స్ ఆవరణలోని పీఎం జన్ ఔషధి కేంద్రంలో రాయితీపై నాణ్యమైన మందులు. బయటి రోగులకు సైతం అత్యంత తక్కువ ధరలకే అందుబాటులో ఆవుతున్న ఔషధాలు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 7 Sept 2026 1:33 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ విమ్స్‌లో పీఎం జన్ ఔషధి కేంద్రం!

Visakhapatnam: చిన్న వ్యాధితో ఆసుపత్రికి వెళ్తే కనీసం పది రకాల మాత్రలు రాస్తున్నారు. 15 రోజులకు సరిపడా మాత్రలకు రూ.1000 నుంచి రూ.1500 వరకు ఖర్చువుతోంది. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, థైరాయిడ్, కీళ్ల నొప్పులు, పక్షవాతం, మూర్చ, గ్యాస్ట్రిక్, కొలెస్ట్రాల్, మైగ్రేన్ లాంటి వ్యాధులకు జీవితాంతం మాత్రలు వాడాల్సిందే. వాటిని కొనుగోలు చేయాలంటే రూ. వేలు అవుతోంది. విమ్స్ ని ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రంలో ఆయా మాత్రలు రాయితీపై తక్కువ ధరకు ఇస్తున్నారు.

బయట రోగులకూ ఇస్తారు..: ప్రధానమంత్రి జన్ ఔషధి దుకాణాలకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరకు మందులు అందిస్తుంది. సాధారణ జనరిక్ దుకాణాల్లో ఎంఆర్పీపై 60శాతం వరకు తగ్గించి అమ్ముతారు. ప్రధానమంత్రి జన్ ఔషధ దుకాణంలో ఇంకా తక్కువకు ఇస్తారు. ఉదాహరణ: O మధుమేహానికి స్పెషలిస్టులు సూచించే మెట్ఫార్మిన్ మాత్రలు(10) ప్రధానమంత్రి జన్ ఔషధి దుకాణంలో రూ.20 ఉంటే జనరిక్ దుకాణంలో రూ.80 ఉంటుంది. విమ్స్ ఆవరణలోని ఈ కేంద్రంలో కేవలం అక్కడి రోగులకే కాకుండా డాక్టర్ ప్రిస్కిప్షన్ ఉంటే సాధారణ ప్రజలకు కూడా ఇస్తారని నిర్వాహకులు తెలిపారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story