Pendurthi: సూర్యనగర్‌లో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుపై స్థానికుల ఆందోళన
Pendurthi: జీవీఎంసీ 96వ వార్డు సూర్యనగర్ పార్కు సమీపంలో జనావాసాల మధ్య ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయవద్దంటూ స్థానిక ప్రజలు బుధవారం నిరసన తెలిపారు.
Pendurthi: సూర్యనగర్‌లో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుపై స్థానికుల ఆందోళన
పెందుర్తి: జననివాసాల మధ్య ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయవద్దంటూ జీవీఎంసీ 96వ వార్డు సూర్యనగర్ ప్రజలు ఆందోళన చేపట్టారు. బుధవారం సూర్యనగర్ పార్కు సమీపంలో నిర్మిస్తున్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద స్థానికులు నిరసన తెలిపారు.
ఓ వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం 20 ఫ్లాట్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ భూమిలో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయడం తగదని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జనావాసాల మధ్య, పార్కు సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడం వల్ల భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భూమిని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బంది కలగని ప్రాంతంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని సూర్యనగర్ వాసులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.