Parawada: పరవాడ ఎంపీపీ ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!
Parawada: పరవాడ ఎంపీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపీపీ పైల వెంకట పద్మలక్ష్మి శ్రీనివాసరావు.
Parawada: పరవాడ ఎంపీపీ ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!
Parawada: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పరవాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరవాడ మండల ఎంపీపీ శ్రీమతి పైల వెంకట పద్మలక్ష్మి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పైల వెంకట పద్మలక్ష్మి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.
వారి త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా వాయువులను పీలుస్తూ, ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నామని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.స్వాతంత్య్ర దినోత్సవం కేవలం జాతీయ పండుగ మాత్రమే కాదని, దేశం పట్ల మన బాధ్యతలను గుర్తు చేసే పవిత్రమైన రోజని ఆమె అన్నారు. దేశ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే నిజమైన ప్రజాసేవ అని పేర్కొన్నారు. యువత దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని, వారు విద్య, క్రీడలు, విజ్ఞానం, సాంకేతిక రంగాల్లో ముందుకు సాగుతూ దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
అనంతరం చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేస్తూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చుక్క రాము నాయుడు, మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు.




