Parawada: పరవాడ ఫార్మా ప్రమాదాలపై సమగ్ర విచారణ చేపట్టాలి

Parawada: పరవాడ ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలపై సీఐటీయూ నిరసన. భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణ చేయాలని గనిశెట్టి డిమాండ్.

CHANDRA SHEKAR, PARAWADA
Published on: 18 July 2026 5:17 PM IST
Parawada
X

Parawada: పరవాడ ఫార్మా ప్రమాదాలపై సమగ్ర విచారణ చేపట్టాలి

పరవాడ: పరవాడ ఫార్మసిటీలో వరస ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతుందని ఇప్పటికైనా జరిగిన ప్రమాదాలపై సమగ్ర విచారణ చేసి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా భద్రత ఆడిట్ నిర్వహించాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.

శనివారం సిఐటియు ఆధ్వర్యంలో ఫార్మాసిటీలో ప్రమాదాలపై సమగ్ర విచారణ చేయాలని ,కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ,భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని, భద్రతా వైఫల్యాలకు కారణమైన యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గని శెట్టి మాట్లాడుతూ టోరెంటో పరిశ్రమలో నాణ్యమైన చైన్ లేకపోవడం వలన చైన్ తెగి సెల్ఫీరిక్ యాసిడ్ ఎం నాగరాజు కెమిస్ట్ పై పడి తీవ్ర గాయాల గురయ్యాడని అన్నారు.

లోహిత్ ఫార్మాలో ఘాడమైన వాయువులు పేర్చిన వెంకటరమణమూర్తి కి తక్షణమే వైద్య సహాయానికి తరలించే ఉంటే వెంటిలేటర్పై వైద్యం పొందే పరిస్థితి ఉండకపోనని పరిశ్రమల భద్రత ప్రమాణాలు లోహిత్ ఫార్మా యాజమాన్యం పాటించడం లేదని అన్నారు. సక్రమమైన మాస్కులు కూడా యాజమాన్యం కార్మికులకి ఇవ్వడం లేదని హెల్మెట్లు , రక్షణ పరికరాలు కార్మికులకు ఇవ్వడం లేదని అన్నారు.

దక్షిణ ఎనర్జీలో ఇద్దరు కార్మికులతో 24 గంటల పాటు యాజమాన్యం పనిచేయడం వల్ల నిండు ప్రాణాలు బలిగొనబడ్డాయన్నారు. యాజమాన్యాలపై ఇప్పటికైనా భద్రత ఆడిట్ నిర్వహించాలని గని శెట్టి డిమాండ్ చేశారు. శ్రీ సాయి చందన ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో కార్మికుల సురక్షితంగా బయటపడినప్పటికీ భారీ ప్రమాదం చోటుచేసుకుందని భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గని శెట్టి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమణ, చిన్నారావు, అప్పల రాజు, శేషు, తదితరులు పాల్గొన్నారు

CHANDRA SHEKAR, PARAWADA

CHANDRA SHEKAR, PARAWADA

Next Story