Madhurawada: మధురవాడలో వినాయక చవితి పందిరి రాట మహోత్సవం!

Madhurawada: మధురవాడ శ్రీనివాస్ నగర్‌లో బొజ్జ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పందిరి రాట పూజ ఘనంగా నిర్వహించారు. స్థానికులు విశేషంగా పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA
Published on: 6 Sept 2026 1:18 PM IST
Madhurawada
X

Madhurawada: మధురవాడలో వినాయక చవితి పందిరి రాట మహోత్సవం!

Madhurawada: మధురవాడ శ్రీనివాస్ నగర్‌లో బొజ్జ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పందిరి రాట మహోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

వినాయక చవితి ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ నిర్వహించిన పందిరి రాట మహోత్సవం సందర్భంగా శ్రీనివాస్ నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానిక యువత సమష్టిగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో మరియు ఐకమత్యంతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో గణేష్, సత్తిబాబు, చిన్నమ్మానాయుడు, మహేష్, హరీష్, జయరాం, బాషా, సురేష్, సతీష్, రఘు, శివ, ఋషి, సింహాచలం, పృథ్వి, గౌతమ్, సునీల్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన మహిళలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఏడాది వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ, కాలనీలో ఐక్యతను చాటుతున్న బొజ్జ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ యూత్‌ను స్థానికులు అభినందించారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA

Next Story