Paderu: పాడేరు పోలీసుల టెక్నాలజీతో రూ.7 లక్షల విలువైన ఫోన్ల రికవరీ!
Paderu: పాడేరులో రూ.7 లక్షల విలువైన 34 మిస్సింగ్, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం (CEIR) తో రికవరీ చేసి బాధితులకు అందజేశారు.
Paderu: పాడేరు పోలీసుల టెక్నాలజీతో రూ.7 లక్షల విలువైన ఫోన్ల రికవరీ!
అల్లూరి జిల్లా: పాడేరు ప్రధాన కేంద్రం స్థానిక ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాజా సింహారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన, మిస్సింగ్ అయిన 34 విలువైన సెల్‌ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రికవరీ చేసినట్లు తెలిపారు.
రికవరీ చేసిన సెల్‌ఫోన్లను పాడేరు డీఎస్పీ కార్యాలయంలో బాధితులకు అందజేసినట్లు చెప్పారు. రికవరీ చేసిన ఫోన్ల విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని తెలిపారు. గత కొన్ని నెలలుగా జిల్లాలో సెల్‌ఫోన్ చోరీలు, మిస్సింగ్‌కు సంబంధించి బాధితుల నుంచి ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సీఈఐఆర్ (CEIR) పోర్టల్, సెల్‌ఫోన్ల ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా ప్రత్యేకంగా ట్రాకింగ్ చేపట్టి వివిధ ప్రాంతాల్లో ఉన్న 34 స్మార్ట్‌ఫోన్లను గుర్తించి రికవరీ చేసినట్లు చెప్పారు. బాధితుల ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకుని పోలీసులు నిరంతరం సెల్‌ఫోన్లను ట్రాక్ చేస్తూ వాటి రికవరీకి చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు.
సెల్‌ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా ప్రజలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ రాజా సింహారెడ్డి సూచించారు. అలాగే 1930కు కాల్ చేయడంతో పాటు సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. ఫోన్ పోయిన వెంటనే సమాచారం అందిస్తే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దానిని ట్రాక్ చేసి రికవరీ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
ఎవరైనా సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే నిరాశ చెందకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, బాధితులకు న్యాయం చేసేందుకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.కాగా, తమ సెల్‌ఫోన్లు ఇక తిరిగి వస్తాయని ఆశలు వదులుకున్న సమయంలో పోలీసులు వాటిని రికవరీ చేసి అందజేయడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం తన సెల్‌ఫోన్ పోయిందని, తిరిగి వస్తుందని అనుకోలేదని ఓ బాధితుడు తెలిపారు.
పోలీసులు ఫోన్ రికవరీ చేసి డీఎస్పీ కార్యాలయానికి పిలిచి అందజేయడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించిన పాడేరు పోలీసుల పనితీరును పలువురు అభినందించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి చోరీ, మిస్సింగ్ సెల్‌ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తమ సెల్‌ఫోన్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఐఎంఈఐ నంబర్ తదితర వివరాలను అందించాలని డీఎస్పీ సూచించారు.




