Paderu: కార్యాలయ క్రమశిక్షణ పాటించాలి: జేసీ శ్రీపూజ
Paderu: కలెక్టరేట్ ఉద్యోగులు సమయపాలన, క్రమశిక్షణ పాటించాలని ఏఎస్ఆర్ జిల్లా జేసీ తిరుమాని శ్రీపూజ ఆదేశం. అనుమతి లేకుండా గైర్హాజరైతే చర్యలు.
Paderu: కార్యాలయ క్రమశిక్షణ పాటించాలి: జేసీ శ్రీపూజ
Paderu: ఎ ఎస్ ఆర్ జిల్లా పాడేరు, , కలెక్టరేట్ కార్యాలయ క్రమశిక్షణ, నియమాలను కఠినంగా పాటించాలని అదికారులకు, సిబ్బందికి ఆదేశాలు జరిసేశారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమయ పాలన, కార్యాలయ నియమావళిని ఉద్యోగులందరూ కఠినంగా పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ స్పష్టం చేశారు. కలెక్టరేట్ కార్యాలయ వివిధ సెక్షన్ల అధికారులు సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కార్యాలయనికి సంబంధించిన పలు శాఖ పరమైన అంశాలపై జాయింట్ కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు.
కార్యాలయ సమయ పాలన, ఉద్యోగులు, సిబ్బంది అందరూ నిర్ణీత కార్యాలయ వేళలను ఖచ్చితంగా పాటిస్తూ, పని వేళలలో హాజరుకావాలన్నారు. దైనందిన పనుల పూర్తిచేసుకొని రోజువారీ కేటాయించిన పనులను సాధ్యమైనంతవరకు ఆరోజు ముగిసేలోపే పూర్తి చేయాల్సి ఉంటుందని, పెండింగ్ లేకుండా చూడాలని తెలిపారు.
పనుల వివరాల నమోదు, రోజువారీ పూర్తయిన పనుల పురోగతిని ఎప్పటికప్పుడు అధికారిక గ్రూప్‌లో అప్‌డేట్ చేస్తూ సమాచారాన్ని తెలపాలన్నారు. కార్యాలయానికి ముందస్తు అనుమతి తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఏ ఒక్క ఉద్యోగి కూడా విధులకు గైర్హాజరు కాకూడదని అలా అనుమతి లేని గైర్హాజర్ అయినా వారిపై చర్యలు, ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైతే దానిని తీవ్రంగా పరిగణించి, నిబంధనల ప్రకారం తగిన శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ఆదేశాలను సిబ్బంది అందరూ విధిగా పాటిస్తూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పేర్కొన్నాయి. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




