Paderu: నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు: డీఎంహెచ్‌ఓ డా. రియాజ్ బేగ్
Paderu: పాడేరులో 41వ నేత్రదాన పక్షోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ రియాజ్ బేగ్ పాల్గొని నేత్రదానం ప్రాముఖ్యతను వివరించారు.
Paderu: నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు: డీఎంహెచ్‌ఓ డా. రియాజ్ బేగ్
Paderu: 41వ నేత్రదాన పక్షోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి నిశాంతి టి. గారి ఆదేశాల మేరకు జిల్లా అంధత్వ నివారణ సంస్థ, అల్లూరి సీతారామరాజు జిల్లా సిబ్బంది మరియు ప్రభుత్వ బహుళార్థ సాధక (స్త్రీ) శిక్షణ కేంద్రం, పాడేరు ఆధ్వర్యంలో నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రియాజ్ బేగ్ పాల్గొనగా, జిల్లా అంధత్వ నివారణ సంస్థ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డా. టి. విశ్వేశ్వర నాయుడుతో పాటు వివిధ శాఖలకు చెందిన ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రియాజ్ బేగ్ మాట్లాడుతూ దేశంలో సుమారు 10 లక్షల మంది కార్నియా సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, ప్రతి సంవత్సరం సుమారు 40,000 నుంచి 50,000 కార్నియాలు అవసరం అవుతున్నాయని తెలిపారు. అయితే గత ఐదేళ్లలో నేత్రదానం ద్వారా సుమారు 18,390 కార్నియాలను మాత్రమే సేకరించగలిగామని పేర్కొన్నారు.
మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరు అంధుల జీవితాల్లో శస్త్రచికిత్స ద్వారా వెలుగులు నింపే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజల్లో నేత్రదానంపై అవగాహన పెంపొందించడంతో పాటు అపోహలు, మూఢనమ్మకాలను తొలగించేందుకు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రి, ప్రాంతీయ ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, బస్‌స్టాండ్లలో వివిధ అవగాహన కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు.
జిల్లా అంధత్వ నివారణ సంస్థ
పాడేరు, జిల్లా ప్రోగ్రాం మేనేజర్
డా. టి. విశ్వేశ్వర నాయుడు మాట్లాడుతూ నేత్రదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలు, మూఢనమ్మకాలను విడనాడాలని కోరారు. వయస్సుతో సంబంధం లేకుండా నేత్రదానం చేయవచ్చని, అయితే ఎయిడ్స్, రేబిస్, పాముకాటు, బ్లడ్ క్యాన్సర్ వంటి కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వారు నేత్రదానానికి అనర్హులని తెలిపారు. డయాబెటిస్, రక్తపోటు (బి.పి.) ఉన్నవారు కూడా నేత్రదానం చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా నేత్రదానంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రియాజ్ బేగ్ చేతుల మీదుగా ప్రథమ, ద్వితీయ బహుమతులతో పాటు మెమెంటోలు అందజేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాడేరు:
పి. హరిప్రియ – ప్రథమ బహుమతి
ఎస్.కె. సమీరా – ద్వితీయ బహుమతి
APTWRS (G), పాడేరు:
ఎస్. రోజా – ప్రథమ బహుమతి
కె. కృపారాణి – ద్వితీయ బహుమతి
ప్రభుత్వ బహుళార్థ సాధక (స్త్రీ) శిక్షణ కేంద్రం, పాడేరు:
పి. లలిత కుమారి – ప్రథమ బహుమతి
ఎం. లోవకుమారి – ద్వితీయ బహుమతి
విజేత విద్యార్థులకు బహుమతులు, మెమెంటోలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ సిబ్బంది డి. వెంకటరావు, సంజీవపాత్రుడు, ప్రభుత్వ బహుళార్థ సాధక (స్త్రీ) శిక్షణ కేంద్రం సిబ్బంది గుల్లేలి సింహాద్రి, రోహిణి, లక్ష్మీ, అరుణేశ్వరి, రజియా బేగం, మరియు శిక్షణ కేంద్రం విద్యార్థినులుతో పాటు ఇతర ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.




