Paderu: పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు: జేసీ శ్రీపూజ
Paderu: పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వీడాలని అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ స్పష్టం చేశారు.
Paderu: పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు: జేసీ శ్రీపూజ
ఏ ఎస్ ఆర్ జిల్లా పాడేరు: అల్లూరి జిల్లా, సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక( పి జి ఆర్ ఎస్ ) కు 149 , రెవెన్యూ క్లినిక్ కు 77 మొత్తం 226 వినతులు వచ్చాయి.
ఈకార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ , పాడేరు ఐటిడిఏ పివో ఆదిత్య వర్మ, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎమ్.భుజంగరావు, జిల్లా అధికారులతో కలసి సంయుక్తంగా వివిధ మండలాలలోని, గ్రామాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. అర్జీ దారుల నుండి స్వీకరించిన అత్యవసర ఫిర్యాదులను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.
జిల్లాలో ఉన్న నియోజకవర్గాల పరిధిలో ప్రతి మండలంలో వారంలో ఒకరోజుగా జిల్లా అధికారులు సమక్షంలో ఒక పిజిఆర్ఎస్ ను బుధవారం, మండల అధికారుల అధ్యక్షతన మండలంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ ను కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లాలో ప్రతి శుక్రవారం జరిగే పిజిఆర్ఎస్ కార్యక్రమానికి తప్పనిసరిగా జిల్లా అధికారి ఆయా శాఖకు సంబందించిన సమగ్ర సమాచారంతో హాజరుకావాలని అలా హాజరుకాలేని అధికారి ముందుగానే అనుమతి పొందాలని ఆదేశించారు. పి జి ఆర్ ఎస్ లో అధికారి మాత్రమే ఉండాలి, అర్జీదారుని నమోదు కౌంటర్ దగ్గర కింద స్థాయి శాఖ అధికారులు ఉండాలని
తెలిపారు.
ఈ సందర్బంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం మండల స్థాయిలో ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని అలా లేని ఎడల వారిపై తగు శాఖపరమైన చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు. గ్రామ సచివాలయాల పరిధిలో ప్రతి గ్రామంలో గ్రామస్థాయి పిజిఆర్ఎస్ ను నిర్వహించి ప్రజా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలన్నారు. మండల స్థాయిలో వచ్చే అర్జీలను మండల స్థాయి లోనే పరిశీలించినట్లయితే, జిల్లా స్థాయిలో ఎక్కువ మంది ప్రజా ఫిర్యాదులు చేసేందుకు రారని, అలాగే ఫిర్యాదులు సంఖ్య తగ్గుతాయని తద్వారా వాటిని వెంటనే పరిష్కరించ గలరని తెలిపారు. ప్రతి ఒక్కరికి జిల్లా అధికారుల వివరాలు తెలిసి ఉండాలని, మండల్ ఎంపీడీవో, మండలానికి సంబంధించిన అధికారుల వివరాలు తెలుసుకొని ఉండాలన్నారు.
అర్జిదారులు మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని,
అర్జీలు నేటికీ పరిష్కారం కాకపోయినా, ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు.
అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ ను సంప్రదించవచ్చన్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే సమస్యలపై ప్రభుత్వం ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తుందని ఐవిఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అభిప్రాయాలను తీసుకుంటుందని, ప్రజల యొక్క ఫిర్యాదులు పరిష్కరించి వారి యొక్క సంతృప్తి స్థాయిలు పెంచాలని, ఈ ప్రక్రియలో జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఏ స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయో ఆ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల పరిధిలో ఉన్నటువంటి ఫిర్యాదుదారులు లతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సమస్య ఎందుకు పరిష్కారం కాదో బాధ్యతగా ఫిర్యాదు దారుని కు వివరించాలన్నారు. ప్రత్యేకంగా భూ సంబంధిత సమస్యలపై వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించేటప్పుడు ఖచ్చితంగా ఫిర్యాదు దారుని భూ రికార్డులను తనిఖీ చేయాలని, ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంతో క్రోడీకరించి సమస్యలను పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వీడాలన్నారు. మండల స్థాయి అధికారులు సమస్యలను పరిష్కరించుటలో కింది స్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు.
ఈ రోజు స్వీకరించిన ఫిర్యాదులలో అత్యధికంగా రెవెన్యూకి 77, డిఎస్ జిఎస్ డబల్యుఓ కార్యాలయం కు 60, పి ఆర్,ఆర్డబల్యు ఎస్ & ఓఇంజనీరింగ్ 28, గురుకులం & సర్వ శిక్ష అభియాన్ కు 23, విద్యా శాఖ, మిగిలిన అప్లికేషన్లు టి డబల్యూ ఇంజనీరింగ్, విద్యుత్ , గృహనిర్మాణ శాఖ, పౌర సరఫరాలు , పంచాయతీ రాజ్, ఆర్ఓఎఫ్ఆర్, ఎస్ ఏం ఐ, పెన్షన్, రోడ్లు భవనాలు ,ఐటీడీఏ, డిడిటిడబ్ల్యుఓ, వైద్య శాఖలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయి.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ పిబికె పరిమళ, డిఇఓ ఎన్ భానుముర్తి రాజు, గురుకులం ఓఎస్డి ముర్తి .డి ఐటీడీఏ ఏపీఓ మరతం , ఏడిహెచ్ఓ బాలమోరళీకృష్ణ, ఐటీడీఏ ఏఓ హేమలత , జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాసరావు, లీడ్ బ్యాంకు మేనేజర్ మాతు నాయుడు, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి ప్రసాద్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఆర్ వి రమణారావు, జిల్లా ఖజానా లెక్కల శాఖ అధికారి అనిల్ కుమార్, ఏపిఈపిడిసిఎల్ డిఇ ఎల్ సి హె చ్ పాత్రుడు, ఆపరేషన్ విజయానంద్, , ఏడి గ్రౌండ్ వాటర్ శ్రీనివాసరావు, ఆర్ ఐ ఓ భీమ్ శంకర్, పాడేరుమండల్ తహశీల్దార్ శ్రీనివాస రావు పలువురు మండల రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




