Narsipatnam: నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఎంపీ చింతకాయల విజయ్ అన్నదానం

Narsipatnam: నర్సీపట్నం నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద అమావాస్య అన్నదానంలో పాల్గొని భక్తులకు స్వయంగా ఆహారం వడ్డించిన రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్.

R. A. Naidu, Narsipatnam
Published on: 10 Sept 2026 6:32 PM IST
Narsipatnam
X

Narsipatnam: నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఎంపీ చింతకాయల విజయ్ అన్నదానం

నర్సీపట్నం: నర్సీపట్నం శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద ప్రతి నెల అమావాస్య సందర్భంగా నర్సీపట్నం బాబు స్టూడియో బాబు మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన భక్తులకు స్వయంగా ఆహారం వడ్డించారు. అనంతరం విజయ్ మాట్లాడుతూ.. ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం ఎంతో పుణ్యకార్యమని, బాబు మరియు ఆయన మిత్రబృందం ఇలాంటి సామాజిక కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.

అమావాస్య రోజున మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం నూతనంగా నిర్మించిన ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించడం ద్వారా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమన్నారు.

అమ్మవారి గుడిలో భక్తులకు అందించే ఈ అన్నదానం ప్రసాదం లాంటిదని, దీనిని ఎవరూ వృథా చేయకుండా స్వీకరించాలని కోరారు. పద్మావతి గారి స్ఫూర్తితో ప్రారంభించిన ఈ అన్నదాన కార్యక్రమం ఎప్పటికీ నిరంతరాయంగా కొనసాగాలని, భవిష్యత్తులో బాబు బృందం ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింతగా చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam

Next Story