Narsipatnam: 1,000 మట్టి వినాయకుల ఉచిత పంపిణీ.. చింతకాయల దివ్యశ్రీ!

Narsipatnam: శుభకానుక ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1,000 మట్టి వినాయక విగ్రహాల వితరణ. పర్యావరణ పరిరక్షణ, కులవృత్తుల ప్రోత్సాహమే లక్ష్యమని చింతకాయల దివ్యశ్రీ పిలుపు.

R. A. Naidu, Narsipatnam
Published on: 13 Sept 2026 2:22 PM IST
Narsipatnam
X

Narsipatnam: 1,000 మట్టి వినాయకుల ఉచిత పంపిణీ.. చింతకాయల దివ్యశ్రీ!

Narsipatnam: పర్యావరణ పరిరక్షణలో భాగంగా నర్సీపట్నంలో భారీ ఎత్తున మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గౌరవ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి చిన్న కోడలు, నర్సీపట్నం పట్టణ టీడీపీ అధ్యక్షులు చింతకాయల రాజేష్ గారి సతీమణి, శుభకానుక ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చింతకాయల దివ్యశ్రీ ఆధ్వర్యంలో సుమారు 1000 మట్టి వినాయకులను భక్తులకు ఉచితంగా వితరణ చేశారు.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జల వనరులకు జరిగే నష్టాలను వివరిస్తూ, ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన మట్టి వినాయకులనే ప్రతిష్టించాలని ఆమె పిలుపునిచ్చారు. ​ఈ సందర్భంగా చింతకాయల దివ్యశ్రీ మాట్లాడుతూ, మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా, కులవృత్తులను నమ్ముకున్న చేతి వృత్తుల కళాకారులను ఆర్థికంగా ప్రోత్సహించినట్లు అవుతుందని పేర్కొన్నారు.

ప్రకృతిని దైవంగా భావించి ఆరాధించడమే మన సనాతన ధర్మం అని, మట్టితో చేసిన స్వామిని పూజించి తిరిగి పవిత్ర జలాల్లో మట్టిలోనే కలపడం ద్వారా మన సంప్రదాయాలను, ధర్మాన్ని సముచితంగా కాపాడుకున్న వారం అవుతామని ఆమె స్పష్టం చేశారు. పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటూనే, జల కాలుష్యాన్ని నివారించి మన భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించినప్పుడే మన సనాతన ధర్మానికి మరియు మూలాలకు నిజమైన గౌరవం దక్కుతుందని ఆమె ఉద్ఘాటించారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam