Madhurawada: మధురవాడలో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చిన మంత్రి లోకేష్!
Madhurawada: విశాఖ చంద్రంపాలెం ప్రభుత్వ పాఠశాలలో రూ.6.5 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. విద్యార్థులతో ముఖాముఖి, సరదాగా ఆటలు.
Madhurawada: మధురవాడలో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చిన మంత్రి లోకేష్!
Madhurawada: మధురవాడ చంద్రంపాలెం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి, విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ),ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు.
విశాఖ జిల్లా మధురవాడ లోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.6.5 కోట్లతో దివీస్ ల్యాబ్స్ సామాజిక బాధ్యత నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను శనివారం ఉదయం ఆయన ఘనంగా ప్రారంభించారు.
కార్యక్రమానికి భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు,టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు,ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్,దివీస్ లాబొరేటరీస్ డైరెక్టర్ నీలమా ప్రసాద్ దివి, తదితర ప్రముఖులు హాజరయ్యారు.విద్యార్థులతో కలిసి ఆటలాడిన మంత్రి
దశాబ్దాలుగా వర్షం పడితే చెరువును తలపించే చంద్రంపాలెం ఉన్నత పాఠశాల మైదానం నేడు సమూలంగా మారిపోయింది. పాఠశాలలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేసి,వర్షపు నీరు నిలవకుండా మైదానాన్ని ఆధునీకరించారు.
విద్యార్థుల కోసం కబడ్డీ,క్రికెట్, బాస్కెట్‌బాల్ బేస్‌బాల్, వాలీబాల్,షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను అందుబాటులోకి తెచ్చారు. మంత్రి లోకేష్ విద్యార్థులతో సరదాగా ఆటలు ఆడుతూ ఈక్రీడా కోర్టులను ప్రారంభించారు.
పాఠశాల ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ,మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంల నిలువెత్తు విగ్రహాలను ఆవిష్కరించారు.విద్యార్థుల తాగునీటి అవసరాల కోసం మూడు ఆర్‌ఓ సేఫ్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. పాఠశాల సమీపంలో జాతీయ రహదారి దాటే విద్యార్థుల సౌకర్యార్థం నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా అందుబాటులోకి తెచ్చారు.
కార్యక్రమంలో భాగంగా పాఠశాల NCC విద్యార్థులు మార్చ్ ఫాస్ట్‌తో మంత్రి లోకేష్‌కు ఘనంగా స్వాగతం పలికారు.విద్యార్థులతో ముఖాముఖి.చమత్కారాలు, వ్యక్తిగత అనుభవాలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం మంత్రి నారా లోకేష్ విద్యార్థులులతో ముఖాముఖిగా మాట్లాడారు విద్యార్థులు అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆయన చమత్కారంగా, స్ఫూర్తిదాయకంగా సమాధానమిచ్చారు.
చంద్రంపాలెం ఉన్నత పాఠశాలకు నేను ఇప్పటివరకు మూడుసార్లు వచ్చాను.ఎప్పుడు వచ్చినా వర్షం పడుతుండేది.నాటి పరిస్థితులతో పోలిస్తే నేడు పాఠశాల రూపురేఖలు ఎంతో మారాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇదే విధంగా మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.
తానీ స్థాయికి రావడానికి తన తల్లే ముఖ్య కారణమని, తల్లిదండ్రుల నుంచే క్రమశిక్షణ నేర్చుకున్నానని వెల్లడించారు.తన తల్లి తనకు ఆదర్శం, మార్గదర్శకమని స్పష్టం చేశారు.పాఠశాల రోజుల్లో తాను చేసిన కొన్ని చిలిపి పనులను కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని,వారానికి ఒకసారి తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి 3-4గంటలు ఆటలు ఆడతానని చెప్పారు. నిజమైన బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్న ప్రశ్నకు స్పందిస్తూ మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించి,తోడుగా నిలిచేవారే నిజమైన స్నేహితులు.జీవితంలో మంచి స్నేహితులు చాలా ముఖ్యం అని వ్యాఖ్యానించారు.
సమాజమే దేవాలయం.. ప్రజలే మన దేవుళ్లు అనే సూత్రంతో ప్రతీ ఒక్కరూ పదిమందికి ఉపయోగపడేలా సాయం చేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన ఆత్మీయ సమాధానాలు, విద్యార్థులను ప్రోత్సహించిన తీరు సభలో ఉన్నవారందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.




