Chodavaram: చోడవరంలో ఘనంగా మదర్ తెరిసా జన్మదిన వేడుకలు!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరంలో మాదిగ ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో మదర్ తెరిసా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Chodavaram: చోడవరంలో ఘనంగా మదర్ తెరిసా జన్మదిన వేడుకలు!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణం లో స్థానిక దుడ్డువీధి శ్రీ నూకంబిక కళ్యాణం మండపంలో ఈరోజు ఉదయం 9 గంటలకు మానవతా మూర్తి సేవకు ప్రతిరూపం జీవితాన్ని సేవకే అంకితం చేసిన మాతృమూర్తి మదర్ తెరిసా జన్మదిన వేడుకలు.
అనకాపల్లి జిల్లామాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా విగ్రహానికి పూల మాలలు అలంకరించారు.
మాదిగ ఉద్యోగుల సమాఖ్య మాజీ జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కండెల్లి వెంకట్రావు మాట్లాడుతూ అల్బెనియా దేశంలో పుట్టి భారత దేశంలో కలకత్తా మురికివాడల్లో ఎంతో మందికి సేవలు అందించారని ఎన్నో అనాధ శరణాలయాలను ఏర్పాటు చేశారని అన్నారు.
కుష్టి వ్యాధిగ్రస్తులకు ఎనలేని సేవలు అందించారన్నారు. భారత్ ప్రభుత్వం తన సేవలకు గుర్తింపుగా భారతరత్న కూడా ఇచ్చారన్నారు. మదర్ తెరిసా ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఆవిడ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి అన్నారు.
మాదిగ ఉద్యోగుల సమైక్య మాజీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మోర్త శ్రీనివాసరావు, మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా కమిటీ సభ్యులు కంటిపాము దేవుడు బాబు, మేస్త్రి బండారు నాయుడు మహిళలు పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు




