Simhachalam: సింహాచల అప్పన్న స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్!
Simhachalam: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రసాదాలు అందజేశారు.
Simhachalam: సింహాచల అప్పన్న స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్!
Simhachalam: శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి పిల్లా శ్రీనివాసరావు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న అనంతరం శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం ఆలయ వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.




