Visakhapatnam: త్వరలోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం!

Visakhapatnam: విశాఖలో జర్నలిస్టులకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. త్వరలోనే ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరిస్తామని హామీ.

GOPI, PENDURTHI
Published on: 13 Sept 2026 3:10 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: త్వరలోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం!

Visakhapatnam: రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమాజానికి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.

వినాయక చవితిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌, ఏపీ బ్రాడ్‌కాస్ట్‌ అసోసియేషన్‌, స్మాల్‌ అండ్‌ మీడియం న్యూస్‌పేపర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం వేమన మందిరంలో జర్నలిస్టుల వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరై జర్నలిస్టులకు మట్టి వినాయక విగ్రహాలు, వ్రతకల్ప పుస్తకాలు, పూలు, పండ్ల మొక్కలు, స్వీట్స్‌ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మట్టి వినాయక విగ్రహాల పంపిణీ మంచి కార్యక్రమమని, పర్యావరణానికి హాని కలిగించకుండా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలను తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని వంశీకృష్ణ శ్రీనివాస్‌ తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్‌, ఆరోగ్య భద్రతతో పాటు ఇతర సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

గౌరవ అతిథిగా హాజరైన సిఎన్ఆర్ సంస్థల గ్రూప్ అధినేత చెల్లుబోయిన నర్సింగరావు మాట్లాడుతూ సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర అత్యంత ప్రశంసనీయమన్నారు. వారి సంక్షేమానికి తన పరిధి మేరకు సహాయం అందిస్తానన్నారు. తాను నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని.. ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు ఇతరులకు సహాయంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అన్నారు.... తాను పారిశ్రామికవేత్తగా రాణించేందుకు ఎంతోమంది సహకారం అందించారని వారిలో కూడా అనేక మంది జర్నలిస్టులు ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఎన్ఏజే ..ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే జర్నలిస్టుల ప్రధాన సమస్యలకు పరిష్కారం లభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా ప్రభుత్వ పరంగా కృషి చేస్తామన్నారు.

వినాయక చవితి సందర్భంగా జర్నలిస్టులకు మట్టి వినాయక విగ్రహాలతో పాటు వ్రతకల్ప పుస్తకాలు, పూలు, పండ్ల మొక్కలు, స్వీట్స్‌ పంపిణీ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమానికి నగరంలోని వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు భారీగా తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ జనసేన పార్టీ నాయకులు కోట్ల రఘు.. విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ.. కార్యదర్శి జి శ్రీనివాసరావు. బ్రాడ్ కాస్ట్ విశాఖ జిల్లా అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు కార్యదర్శి కింతాడ మదన్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్.. సీనియర్ పాత్రికేయులు ఎమ్మెస్సార్ ప్రసాద్. స్వాతి ప్రమోటర్స్ ప్రతినిధి చక్రవర్తి ఆధ్యాత్మికవేత్త రాజశేఖర్ ఫెడరేషన్ జిల్లా నాయకులు బి ఆనందరావు.. బండారు శివప్రసాద్.. రామకృష్ణ.. బొబ్బర ప్రసాద్.. పి నగేష్ బాబు హరి రాజశేఖర్ జగన్నాథము శర్మ... గణేష్.. రవి శంకర్.. హరనాథ్.. ప్రసాద్.. పద్మనాభం సత్య నారాయణ, రంగ ధామం డి ఎన్. ఎస్.సాయి.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI