Anakapalli: మామిడాడలో నూతన దాల్ మిల్ ప్రారంభం: ఎమ్మెల్యే విజయ్ కుమార్

Anakapalli: రాంబిల్లి మండలం మామిడాడలో నూతన దాల్ మిల్‌ను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 6 Sept 2026 4:14 PM IST
Anakapalli
X

Anakapalli: మామిడాడలో నూతన దాల్ మిల్ ప్రారంభం: ఎమ్మెల్యే విజయ్ కుమార్

Anakapalli: అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి నియోజకవర్గం: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు కావడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రైతులకు, ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ అన్నారు.

రాంబిల్లి మండలం మామిడాడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన దాల్ మిల్‌ను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దాల్ మిల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత యూనిట్లు ఏర్పాటు కావడం అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా స్థానికంగా పండించే పప్పుధాన్యాల ప్రాసెసింగ్‌కు దాల్ మిల్ ఉపయోగపడటంతో రైతులకు, స్థానిక ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

అదేవిధంగా పరిశ్రమల ఏర్పాటుతో యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రాంత అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో దాల్ మిల్ నిర్వాహకులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story