Chodavaram: లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందించిన ఎమ్మెల్యే కేఎస్ఎన్‌ఎస్ రాజు!
Chodavaram: చోడవరం పీఎస్ పేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ: లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే కేఎస్ఎన్‌ఎస్ రాజు.
Chodavaram: లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందించిన ఎమ్మెల్యే కేఎస్ఎన్‌ఎస్ రాజు!
Chodavaram: చోడవరం గ్రామపంచాయతీ పరిధిలోని పీఎస్ పేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎంఎస్ రాజు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు.
పేదలు, వృద్ధులు, వితంతువులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను ఎమ్మెల్యే రాజు అందజేశారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో ఈవో గంగాధర్, ఎంపీడీవో రాజు, మండల టీడీపీ నాయకులు, పీఎస్ పేటకు చెందిన టీడీపీ, జనసేన కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.




